Tirumala: తిరుమల శ్రీవారికి అరుదైన కానుక.. బంగారు లక్ష్మీ పతకం విరాళంగా ఇచ్చిన భక్తుడు!
ఆపదమొక్కుల స్వామికి మొక్కులు చెల్లించే భక్తులు రోజూ ఎన్నో కానుకలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళంగా ఇచ్చాడు ఒక భక్తుడు. బెంగుళూరుకు చెందిన కె.యం.శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు రూ.25 లక్షలు విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పతకాన్ని విరాళంగా అందించారు.

అపర కుబేరుడు, అలంకార ప్రియుడికి వేలకోట్ల ఆస్తులే కాదు వెలకట్టలేని వజ్ర వైడూర్యాల ఆభరణాలు ఉన్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడు దాకా సమర్పించే కానుకలతో వెంకన్న ఆస్తులు ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆపదమొక్కుల స్వామికి మొక్కులు చెల్లించే భక్తులు రోజూ ఎన్నో కానుకలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళంగా ఇచ్చాడు ఒక భక్తుడు. బెంగుళూరుకు చెందిన కె.యం.శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు రూ.25 లక్షలు విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పతకాన్ని విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు.
టీటీడీకి రూ.కోటి విరాళం.
ఇక వెంకన్నకు విలువైన ఆభరణాలు ఆస్తులే కాదు, టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులకు కూడా భక్తులు రూ. కోట్లలో విరాళాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే బెంగుళూరుకు చెందిన కల్యాణ్ రామన్ కృష్ణమూర్తి అనే భక్తుడు బుధవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టు రూ.కోటి విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




