- Telugu News Photo Gallery Spiritual photos Visiting these temples in Andhra Pradesh on Krishnashtami brings good luck.
కృష్ణాష్టమి రోజున ఈ ఆలయాలకు వెళ్తే.. అదృష్టం మీ తలుపు తట్టినట్టే..
శ్రావణమాసంలోని కృష్ణపక్ష అష్టమి రోజున కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడు దేవకీ గర్భంలో జన్మించడానికి నమ్ముతారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఆ గోవర్ధనదారుడిని భక్తితో కొలుస్తారు. అయితే ఈరోజున ఏవైన వైష్ణవ దేవాలయాలకు వెళ్లడం వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాష్టమి రోజున చూడదగ్గ ఆలయాలు ఏంటో ఈరోజు మన పూర్తి వివరంగా తెలుసుకుందాం పదండి..
Updated on: Aug 13, 2025 | 11:44 AM

వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో తిరుమలలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక, అత్యధికంగా సందర్శించబడే ఆలయాలలో ఒకటి. ఇది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు విష్ణువు వెంకటేశ్వరుడిగా పూజలందుకొంటానో మహా క్షేత్రం. ఇక్కడ కృష్ణాష్టమి ఏంటో వైభవంగా జారుతుంది. ఈ రోజున ఈ దేవాలయ దర్శనం వల్ల సకల పాపాలు తొలగి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం.

నరసింహ స్వామి ఆలయం, అహోబిలం ఆలయం: నంద్యాల జిల్లాలో ఉన్న ఈ ఆలయం నరసింహ స్వామికి అంకితం చేయబడింది. ఇది అందమైన పరిసరాలకు, హిందూ పురాణాలలో ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. కృష్ణాష్టమి రోజున ఈ దేవాలయాన్ని దర్శించడం శుభప్రదంగా భావిస్తారు.

వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలం : భూతల స్వర్గంగా ఖ్యాతి పొందిన విశాఖపట్నంలో ఉంది ఈ ఆలయం. ఇక్కడ విష్ణుమూర్తి వరాహ లక్ష్మీ నరసింహ స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఇది విష్ణువు మూడవ అవతారం. ఒరిస్సా, చాళుక్య. చోళ నిర్మాణ శైలులను కలిగి ఉంది. అదృష్టం కోసం కృష్ణాష్టమి రోజున ఈ దేవాలయాన్ని దర్శించండి.

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, అంతర్వేది: ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి భక్తుల కోరికలు తీరుస్తున్నారు. ఇది అహోబిలం, సింహాచలంలనే నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటి. కృష్ణాష్టమి రోజున ఇక్కడికి వెళ్తే అదృష్టం కలుగుతుందని నమ్మకం. ఎక్కడికి చేరువలో గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది.

వెంకటేశ్వర స్వామి ఆలయం, ద్వారక తిరుమల: చిన్న తిరుపతి అని కూడా పిలువబడే ఈ ఆలయం బాలాజీకి అంకితం చేయబడిన క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. ఇక్కడ కృష్ణాష్టమి చాలా బాగా జరుగుతుంది. ఈ రోజున ఈ ఆలయం దర్శనం చేసుకొంటే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.




