AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: ఈ నెల 12న బాధిత కుటుంబాలకు TTD ఆర్థిక సాయం.. పిల్లలకు ఉచిత విద్య

తిరుపతి బైరాగి పట్టెడ లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం వచ్చి తొక్కి సలాట లో మృతి చెందిన బాధిత కుటుంబాలను టీటీడీ ఆర్థికంగా ఆడుకుంటుంది. జనవరి 12న జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు టీటీడీ ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించింది.

TTD: ఈ నెల 12న  బాధిత కుటుంబాలకు TTD ఆర్థిక సాయం.. పిల్లలకు ఉచిత విద్య
Tirupati Darshan Stampede
Raju M P R
| Edited By: Surya Kala|

Updated on: Jan 11, 2025 | 6:44 PM

Share

ఇటీవల వైకుంట ఏకాదశి టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలను నేరుగా కలిసి ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 12 నుంచి చెక్కుల పంపిణీ చేయనుంది. తిరుమలలోని టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు క్యాంపు కార్యాలయంలో బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆరుగురు మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు స్వయంగా వారిని సందర్శించి ఎక్స్ గ్రేషియా చెక్కులను పంపిణీ చేసేందుకు కొంతమంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, నర్సీపట్నంకు పంపనున్న టీటీడీ బోర్డు సభ్యుల బృందంలో బోర్డు సభ్యులు జోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎం ఎస్ రాజు, భాను ప్రకాష్ రెడ్డి లు ఉన్నారు.

ఇక తమిళనాడు, కేరళకు వెళ్లనున్న టిటిడి బోర్డు సభ్యుల కమిటీలో రామమూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, నరేష్ కుమార్, శాంత రాం, సుచిత్ర ఎల్లా ఉన్నారు. టీటీడీ బోర్డు సభ్యుల బృందాలు ఆయా ప్రాంతాల్లోని మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి, జిల్లా మంత్రులు, స్థానిక శాసనసభ్యులతో కలిసి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కులను అందించనున్నారు.

అదే విధంగా ఈ కమిటీలు ప్రతి కుటుంబంలో ఒకరికి ఒక కాంట్రాక్టు ఉద్యోగంతో పాటు టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి సంబంధిత కుటుంబాల ఉద్యోగ, విద్యా వివరాలను కూడా ధృవీకరించి సేకరించనున్నాయి. తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన భక్తులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల చెక్కులను కూడా టీటీడీ బోర్డు సభ్యుల బృందం పంపిణీ చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..