AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆలయాన్ని సందర్శించి నాణెం సమర్పిస్తే పేదరికం తొలగిపోతుందని నమ్మకం..

భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు రహస్యాలు, అద్భుతాలకు సంబంధించిన కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ రోజు మనం ఒక గొప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం.. ఈ ఒక దేవాలయాన్ని సందర్శించడం ద్వారా పేదరికం తొలగిపోతుంది. అంతేకాదు ఈ ఆలయం గురించి ప్రజలలో అనేక ఇతర నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి.

ఈ ఆలయాన్ని సందర్శించి నాణెం సమర్పిస్తే పేదరికం తొలగిపోతుందని నమ్మకం..
Kuber Dev Temple
Surya Kala
|

Updated on: Jan 11, 2025 | 5:15 PM

Share

భారతదేశాన్ని దేవాలయాల దేశం అంటారు. ఇక్కడ దేవాలయాల రహస్యాలు, అద్భుతాల కథలు ప్రాచుర్యం పొందాయి. కొన్ని విశ్వాసం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. అలాంటి ఒక దేవాలయంలో ఒకటి సంపదకు దేవుడు అయిన కుబేరుడిది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే పేదరికం తొలగిపోతుందని ప్రజల నమ్మకం. అంతేకాదు ఇక్కడ కుబేరుడికి నాణేలను సమర్పించడంతోపాటు ఇతర భిన్నమైన సంప్రదాయాలు ఆకట్టుకుంటాయి.

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

సంపదకు దేవుడైన కుబేరుడి ఈ ఆలయం దేవభూమి ఉత్తరాఖండ్‌లోని అల్మోరా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని జగేశ్వర్ ధామ్ అని పిలుస్తారు. పేదరికం పోవాలనే కోరికతో ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

ఇవి కూడా చదవండి

పేదరికం నుంచి విముక్తి

కుబేరుడి ఆశీర్వాదం లభించిన వ్యక్తికి కీర్తి, సంపద మొదలైనవి లభిస్తాయని నమ్మకం. ప్రతిరోజూ భక్తులు వివిధ కోరికలతో ఈ ఆలయంలోకి వెళ్లి కుబేరుడిని ప్రార్ధిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా మనిషి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడని .. జీవితంలోని సమస్యల నుంచి బయటపడతాడని నమ్ముతారు.

బంగారు వెండి నాణేలు సమర్పణ

ఈ ఆలయంలో కుబెరుడిని దర్శింసుకోవడమే కాదు బంగారు లేదా వెండి నాణేలను సమర్పిస్తారు వాటికి పూజలు చేసిన.. ఆ నాణేలను పసుపు వస్త్రంలో కట్టి ఇంటికి తీసుకువెళతారు. ఇలా చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు తీరతాయని విశ్వాసం. ఈ ఆలయానికి వెళ్ళడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు మళ్ళీ ఆలయానికి వెళ్లి కుబేరుడికి బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆలయ చరిత్ర

జగేశ్వర్ ధామ్ కాంప్లెక్స్‌లో ఉన్న 125 ఆలయ సమూహాలలో ఒక ఆలయం.. సంపదకు అధినేత అయిన కుబేరుడి ఆలయం ఉంది. ఇది భారతదేశంలోని ఎనిమిదవ కుబేరు దేవాలయం. ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదిగా చెబుతారు. ఈ పురాతన ఆలయం భక్తులకు విశ్వాసానికి ప్రధాన కేంద్రం. కుబేరుడు ఇక్కడ ఏకముఖ శివలింగంలో శక్తి రూపంలో ఉన్నాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.