AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumba: మహా కుంభకు వెళ్తున్నారా.. మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ ఎక్కడ ఉన్నాయంటే..

ప్రయాగరాజ్ కుంభ మేళా రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. దేశ వ్యాప్తంగానే కాదు విదేశీయులను కూడా ఆకర్షిస్తున్న మహా కుంభలో పాల్గొనడానికి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా.. అయితే అక్కడ మీ బడ్జెట్ కు అనుగుణంగా చౌకైన ధరలో హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. మహాకుంభ సమయంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే వారు ఎక్కడ బస చేయాలి? ఎంత ఖర్చవుతుంది అని ఆలోచిస్తుంటే.. ఈ రోజు మహా కుంభ జరిగే ప్రాంగణంలో మాత్రమే కాదు ప్రయాగ్‌రాజ్‌లో ఎక్కడ తక్కువ ఖర్చుతో బస చేయవచ్చు? త్రివేణీ సంగమంలో ఎలా స్నానం చేయవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

Maha Kumba: మహా కుంభకు వెళ్తున్నారా.. మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ ఎక్కడ ఉన్నాయంటే..
Maha Kumbha Mela 2025
Surya Kala
|

Updated on: Jan 11, 2025 | 3:30 PM

Share

జనవరి 13 వ తేదీ పుష్య మాసం పౌర్ణమి రోజున ప్రయాగరాజ్ లో మహా కుంభ మొదలు కానుంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు కొనసాగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా మహాకుంభ సమయంలో సంగమంలో స్నానం చేయాలనుకుంటున్నారా.. అయితే మీ బడ్జెట్ కు అనుగుణంగా తక్కువ ధరలో లభ్యం అయ్యే మంచి ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. ఇక్కడ బస చేయడం వలన మీరు అనుకున్న బడ్జెట్ లో జాతరను సందర్శించించి.. ఎంజాయ్ చేయవచ్చు.

ఈ నెలలో జరగనున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తారని.. సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో జాతర జరిగే సమయంలో అక్కడ బస చేయడానికి పెద్దగా ఇబ్బంది పడకూడదు అంటే పూర్తి వివరాలు తెలుసుకుని వెళ్ళడం ముఖ్య్యం. కనుక ఈ రోజు బస చేయడానికి బడ్జెట్‌కు అనుకూలమైన ప్రదేశాలు.. గురించి తెలుసుకుందాం..

టెంట్ సిటీ: మహా కుంభమేళా జరిగే ప్రాంగణం మధ్యలో ఉండాలనుకుంటే.. త్రివేణి సంగమం సమీపంలోని టెంట్ సిటీ మంచి ఎంపిక. ప్రయాగ్‌రాజ్‌లోని సంగం సమీపంలోని టెంట్ సిటీ మాల్‌లో తక్కువ బడ్జెట్‌లో బస చేయవచ్చు, అంతేకాదు ఇక్కడ నుంచి సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొనవచ్చు.

ఇవి కూడా చదవండి

బడ్జెట్ టెంట్: బడ్జెట్ తక్కువగా ఉంటే.. త్రివేణీ సంగం నగరికి దగ్గరలో ఉన్న టెంట్లు అద్దెకు లభిస్తాయి. ఇక్కడ రాత్రి నివసించేందుకు తక్కువ ధరలో టెంట్లు లభిస్తాయి. ఈ టెంట్ లో కొంచెం తక్కువ కాంతి ఉంటుంది. అంతేకాదు బాత్రూమ్‌ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్నానం చేయడానికి ఒక ప్రదేశం ఉంటే చాలు అని అనుకుంటే… ఈ టెంట్ మంచి ఎంపిక.

డీలక్స్ టెంట్: కొంత సౌకర్యం కావాలంటే డీలక్స్ టెంట్లు ఎంచుకోవచ్చు. దీని ప్రారంభ ధర రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది. ఈ టెంట్లలో వ్యక్తిగత బాత్రూమ్, మంచి నాణ్యమైన పరుపు, 24 గంటల విద్యుత్ సౌకర్యం లభిస్తుంది. అంతేకాదు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ సందడి తక్కువగా ఉంటుంది.

ఆశ్రమాలు, ధర్మశాలలు: మేళా జరిగే ప్రాంతం అంతటా అనేక ధర్మశాలలు, ఆశ్రమాలు నిర్మించబడ్డాయి. ఇక్కడ భజనలు, కీర్తనలు అలాగే కథలను వినవచ్చు. చాలా ధర్మశాలల్లో ఉచితంగా బస చేసే అవకాశం ఉంది. అదే సంయమలో కొన్నింటిలో చాలా తక్కువ డబ్బు చెల్లించి ఉండవచ్చు. జాతర ప్రాంతంలో ఉచిత ఆహారం అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అక్కడ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. కొన్ని ధర్మశాలల గురించి చెప్పుకుందాం.

బంగూర్ ధర్మశాల: ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ధ్యానం, పూజలు చేసుకోవచ్చు. ఈ ధర్మశాల సంగం ఘాట్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి మీరు మొత్తం జాతరను ఆస్వాదించవచ్చు. ఉదయాన్నే స్నానానికి కూడా వెళ్ళవచ్చు.

రాహి త్రివేణి దర్శనం: జాతర ప్రాంగణంలోనే రాహి త్రివేణి దర్శనం కూడా ఉంది. రాత్రికి రూ.2,000 నుంచి రూ.3,000 చెల్లించి ఇక్కడ బస చేయవచ్చు. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానానికి అనుకూలమైన ప్రదేశం కనుక ఈ ప్రదేశం ప్రయాణికులకు ప్రసిద్ధి చెందిన ఎంపికగా మారుతుంది.

ఇవి మాత్రమే కాదు ప్రయాగ్‌రాజ్‌లోని ఫెయిర్ ఏరియాకు సమీపంలో ఉన్న విలాసవంతమైన, బడ్జెట్ హోటళ్ల జాబితాను యుపి ప్రభుత్వం సిద్ధం చేసింది.ఇక్కడ మీకు పార్కింగ్‌తో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా అందిస్తారు. ఆ హోటళ్లు కూడా బెస్ట్ ఎంపిక.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..