పన్ను బకాయిలపై కార్పొరేషన్‌ కొరడా

తిరుపతి కార్పొరేషన్‌ పన్ను వసూళ్ల విషయంలో దూకుడు పెంచింది. మొండిబకాయిలపై ప్రత్యేక దృష్టి సారించింది. పన్నుల విషయంలో కఠినంగా వ్యవహారించే ప్రయత్నం చేస్తోంది. ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్ నోటిస్‌లు జారి చేస్తోంది.ఈ మేరకు పన్ను బకాయిలపై దృష్టి పెట్టిన తిరుపతి కార్పొరేషన్ అధికారులు మొండిబకాయిల భరతం పట్టే పనికి శ్రీకారం చుట్టారు. తిరుపతి పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి 66 వేల అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఏటా పన్నుల […]

పన్ను బకాయిలపై కార్పొరేషన్‌ కొరడా
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 13, 2020 | 1:34 PM

తిరుపతి కార్పొరేషన్‌ పన్ను వసూళ్ల విషయంలో దూకుడు పెంచింది. మొండిబకాయిలపై ప్రత్యేక దృష్టి సారించింది. పన్నుల విషయంలో కఠినంగా వ్యవహారించే ప్రయత్నం చేస్తోంది. ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్ నోటిస్‌లు జారి చేస్తోంది.ఈ మేరకు పన్ను బకాయిలపై దృష్టి పెట్టిన తిరుపతి కార్పొరేషన్ అధికారులు మొండిబకాయిల భరతం పట్టే పనికి శ్రీకారం చుట్టారు. తిరుపతి పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి 66 వేల అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఏటా పన్నుల రూపంలో 55 వేల కోట్ల రూపాయిలు కార్పొరేషన్‌కు చేరాల్సి ఉండగా, ఇప్పటికి వరకు చేరాలేదంటున్నారు అధికారులు. ఇందులో ప్రైవేటు ఆస్తులు తక్కువగానే ఉండగా ప్రభుత్వ ఆస్తులు మాత్రం కోట్ల రూపాయిల్లో బకాయిలు ఉన్నాయి. కార్పొరేషన్‌ల ఆదాయాన్ని సమకూర్చే రెవిన్యూ పనితీరు మెరుగుపరిచే విధంగా పనులు ప్రారంభించింది. ఇందులో భాగంగానే పన్నుల వసూళ్లల్లో వేగం పెంచింది. మార్చి నెలాఖరుకు 95 శాతం పన్నులు వసూలు కావాలంటు టార్గెట్‌ విధించిన కమిషనర్‌ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

మరోవైపు కార్పొరేషన్ లెక్కల ప్రకారం ప్రైవేటు ఆస్తుల బకాయిలు 4 కోట్ల వరకు ఉండగా..దాదాపు వందమందికి పైగా పన్నులు చెల్లించకుండా వివిధ కారణాలతో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే టీటీడీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు కోట్ల రూపాయిల బకాయిలు ఉన్నా… రెవెన్యూ విభాగం మాత్రం ఎలాంటి నోటిసులు జారీ చేయలేకపోతుంది. టీటీడీతో పాటు రైల్వే, ఆర్టీసీ, యూనివర్శిటీలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఆస్పత్రుల నుంచి పెద్ద మొత్తంలో పన్నులు రావాల్సి ఉంది. టీటీడీ నుంచి దాదాపు 85 కోట్ల వరకు రావాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తులు, భవనాల నుంచి కోట్లాది రుపాయిల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ… కార్పోరేషన్ మాత్రం ఇప్పటికి వరకు ఎలాంటి నోటిసులు ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు