అదే ఆఖరి సెల్ఫీ అయింది.. ముగ్గురూ సరదగా ప్రాజెక్టు వద్దకు వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఎంతో ఆహ్లాదంగా నీటిలో ఈత కొడుతూ ఉన్న ముగ్గురు యువకులకు.. ఆ నీరే యమపాశమైంది. చక్కగా ఈత కొట్టినంత సేపు బాగానే ఉంది చాపల కోసం అత్యాశపడిన ఆ ముగ్గురు యువకులు.. మరింత లోతులోకి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఎంతో ఆహ్లాదంగా నీటిలో ఈత కొడుతూ ఉన్న ముగ్గురు యువకులకు.. ఆ నీరే యమపాశమైంది. చక్కగా ఈత కొట్టినంత సేపు బాగానే ఉంది చాపల కోసం అత్యాశపడిన ఆ ముగ్గురు యువకులు.. మరింత లోతులోకి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గల్లంతైన ఆ యువకుల కోసం అధికారులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం చల్లబసాయ పల్లె సమీపంలోని తెలుగుగంగ ప్రాజెక్టు అంతర్భాగమైన సబ్సిడీ రిజర్వాయర్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో ప్రొద్దుటూరు కు చెందిన ముగ్గురు యువకులు సరదాగా సబ్సిడీ రిజర్వాయిర్ వద్దకు వెళ్లారు.. ఈ సందర్భంగా ఈత కొడుతూ.. సెల్ఫీలు కూడా దిగారు. ఈత అనంతరం చేపల కోసం సబ్సిడీ రిజర్వాయిర్ లోకి దిగారు.. అంతే నీటి వొరవడి ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు.
నిన్న సాయంత్రం ఈ ముగ్గురు యువకులు సరదాగా సబ్సిడీ రిజర్వాయర్ వద్దకు విహార యాత్రకు వెళ్లినట్లు సమాచారం. గల్లంతైన వారికోసం గజ ఈతగాళ్లతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాలువ గట్టుపైన ఉన్న సెల్ ఫోన్ల ఆధారంగా గల్లంతైన వారి వివరాలను పోలీసులు గుర్తించారు.
వీరంతా ప్రొద్దుటూరుకు చెందిన యువకులని నిన్న ఆదివారం కావడంతో సరదాగా ఈత కొట్టడానికి సబ్సిడీ రిజర్వాయర్ వద్దకు వచ్చారని.. అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో చేపలు తీసుకెళ్లాలని ఆలోచనతో చేపల కోసం మరింత లోతులోకి వెళ్లారు.. ఆ తర్వాత లోతులోకి వెళ్లి మునిగిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.
చేపల వేటకు వెళ్లే ముందు యువకులు వారి సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకున్నారు. అవే వారికి ఆఖరి సెల్ఫీలుగా మారాయని.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గల్లంతైన వారు.. ముదాపీర్ (22), పఠాన్ రాంతుల్లా (23), వేంపల్లె షాహిద్ (23) గుర్తించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..