ఈ దీపాన్ని శివుడు, పార్వతీ దేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించి చిమ్మిలి, పచ్చి పాలు, వడపప్పు, అరటి పండ్లు, తాంబూలం ఇవన్నీ నివేదించి, సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవాసం ఉంటారు. ఇది తమిళనాడులో ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం ఉండదు.