- Telugu News Photo Gallery Do this if you have heavy bleeding during your period, check here is details in Telugu
Heavy Bleeding in Periods: పీరియడ్స్ సమయంలో హెవీ బ్లీడింగ్ అవుతుందా.. ఇలా చేయండి..
నెలసరి అనేది ప్రతీ మహిళ జీవితంలో సర్వ సాధారణమైన ప్రక్రియ. అయితే ఈ పీరియడ్స్ అనేవి ప్రతీ ఒక్కరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి సాధారణంగానే ఉన్నా.. కొంత మందికి మాత్రం నెలసరి వస్తుంది అంటే చాలా భయం వేస్తుంది. తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఈ బ్లీడింగ్ అనేది కొంత మందికి వారం రోజుల పాటు ఉంటుంది. కానీ చాలా మంది దీన్ని తేలికగా తీసుకుంటారు. అలా అస్సలు తీసుకోకూడదు. ఈ సమస్య చాలా తీవ్రమైంది. ఇదే పరిస్థితి కొనసాగితే..
Updated on: Jul 29, 2024 | 4:41 PM

నెలసరి అనేది ప్రతీ మహిళ జీవితంలో సర్వ సాధారణమైన ప్రక్రియ. అయితే ఈ పీరియడ్స్ అనేవి ప్రతీ ఒక్కరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి సాధారణంగానే ఉన్నా.. కొంత మందికి మాత్రం నెలసరి వస్తుంది అంటే చాలా భయం వేస్తుంది. తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, హెవీ బ్లీడింగ్ ఉంటుంది.

ఈ బ్లీడింగ్ అనేది కొంత మందికి వారం రోజుల పాటు ఉంటుంది. కానీ చాలా మంది దీన్ని తేలికగా తీసుకుంటారు. అలా అస్సలు తీసుకోకూడదు. ఈ సమస్య చాలా తీవ్రమైంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆరోగ్యానికే చాలా ప్రమాదం.

హెవీ బ్లీడింగ్ జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరోన్ వంటి హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిన్ ఉండటం వల్ల కూడా అధిక రక్త స్రావం అవుతుంది. అంతే కాదు కొన్ని రకాల మందులు వాడకం వల్ల కూడా రక్తం పల్చగా మారి బ్లీడింగ్ అవుతుంది.

ఈ హెవీ బ్లీడింగ్ కారణంగా ఎక్కడికైనా వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. ప్యాడ్స్ ఎక్కువగా మార్చాల్సి ఉంటుంది. రక్తం కూడా క్లాట్స్ కింద వస్తుంది. తీవ్రమైన బలహీనత, తల తిరగడ, అలసట వంటివి ఉంటాయి. ఎనీమియాకు దారి తీయవచ్చు.

అధిక రక్త స్రావం తగ్గాలంటే.. దాల్చిన చెక్కను నీటిలో వేసి బాగా మరిగించాలి. దీన్ని రోజులో రెండు సార్లు తాగాలి. అలాగే మీరు తీసుకునే ఫుడ్ కూడా మార్చాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. వైద్యుల్ని కూడా సంప్రదిస్తే మరింత మంచిది.





























