- Telugu News Photo Gallery Cinema photos These are the movies that should not be missed at all in Dhanush's movies
Danush : ధనుష్ నట విశ్వరూపాన్ని ఉదాహరణలు ఈ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి
ధనుష్ చాలా గొప్ప నటుడు. ఆయన నటనకు ఉదాహరణగా చెప్పుకోవడానికి చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో మొదటిగా చెప్పే సినిమా అసురన్. వెట్రి మారన్ దర్శకత్వంలో నటుడు ధనుష్ నటించిన 2019 చిత్రం 'అసురన్'. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
Updated on: Jul 29, 2024 | 3:48 PM

ధనుష్ చాలా గొప్ప నటుడు. ఆయన నటనకు ఉదాహరణగా చెప్పుకోవడానికి చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో మొదటిగా చెప్పే సినిమా అసురన్. వెట్రి మారన్ దర్శకత్వంలో నటుడు ధనుష్ నటించిన 2019 చిత్రం 'అసురన్'. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఆతర్వాత మరోసారి వెట్రి మారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన సినిమా వడచెన్నై ఈ సినిమా 2018లో విడుదలైంది. ఈ సినిమాలో ధనుష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈమూవీలో చాలా నేచురల్ గా నటించాడు ధనుష్.

దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా 2006లో విడుదలైన చిత్రం 'పుట్టుపెట్టై' కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మరోసారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్ నటించిన 'కర్ణన్' చిత్రం 2021లో విడుదలైంది.

అంతకు ముందు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటుడు ధనుష్ నటించిన 2003 చిత్రం 'కాదల్ కొండేన్'.'పవర్ పాండి' ఈ సినిమాకు ధనుష్ స్వీయ దర్శకత్వం వచ్చారు ఈ సినిమా 2017లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

యారడి నీ మోహిని' దర్శకుడు మిత్రన్ జావకర్ దర్శకత్వంలో నటుడు ధనుష్ నటించిన 2008 చిత్రం.ఇక వీటితో పాటు రీసెంట్ గా రిలీజ్ అయినా రామన్ సినిమా కూడా. రాయన్ సినిమాకు ధనుష్ స్వీయ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది.



















