- Telugu News Photo Gallery Cinema photos Do you remember the child in this photo? She is Aishwarya Lakshmi
ఈ బూరెబుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. తన అందంతో కుర్రాళ్లను పడేస్తుంది
సోషల్ మీడియాలో హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలకు కొదవే లేదు. తమ అభిమాన హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చెర్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ చిన్నారి ఫోటో వైరల్ అవుతుంది. పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
Updated on: Jul 29, 2024 | 3:44 PM

సోషల్ మీడియాలో హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలకు కొదవే లేదు. తమ అభిమాన హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చెర్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ చిన్నారి ఫోటో వైరల్ అవుతుంది. పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

ఆమె మరెవరో కాదు తన నటనతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఐశ్వర్య లక్షీ. ఈ మలయాళీ ముద్దుగుమ్మ 1991 సెప్టెంబర్ 6న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది.నటనపై ఉన్న ఆసక్తితో మెడిసిన్ చదివి సినిమాల్లోకి అడుగుపెట్టారు.

మోడల్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత ఐశ్వర్యలక్ష్మికి సినిమా అవకాశాలు రావడం మొదలైంది. నటి ఐశ్వర్య లక్ష్మి 2017లో మలయాళ చిత్రం మాయానదిలో నటించడం ద్వారా రంగ ప్రవేశం చేసింది. ఐశ్వర్య లక్ష్మి 2019 చిత్రం యాక్షన్‌తో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.

పలు చిత్రాల్లో నటిస్తూనే ఉన్నా.. విష్ణు విశాల్ తో చేసిన 'గట్ట కుస్తీ' ఆమెకు మాస్ ఎంట్రీ ఇచ్చింది.దీని తరువాత, అతను మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా రెండు భాగాలలో ప్రధాన పాత్ర పోషించింది ఈ బ్యూటీ.

పొన్ని సెల్వన్‌లో పూంగుళీ పాత్రతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటే తన ఫోటోలను రెగ్యులర్ గా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





























