- Telugu News Photo Gallery Cinema photos In the week gap, two youth full movies will entertain the audience
Youth Movies: యూత్ ఫుల్ కంటెంట్‌కు మళ్లీ ఊపు.. వారం గ్యాప్‌లో రెండు చిత్రాలు సత్తా..
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్లు.. ఇండస్ట్రీలో కొత్త ఫార్ములా ఇది. యూత్ ఫుల్ కంటెంట్‌కు మళ్లీ ఊపొచ్చినట్లే కనిపిస్తుంది సీన్ చూస్తుంటే ఇప్పుడు. తాజాగా రెండు సినిమాలు ఇదే రూట్‌లో వచ్చేస్తున్నాయి. అది కూడా వారం గ్యాప్‌లో సత్తా చూపించడానికి దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఏంటా యూత్ ఫుల్ మూవీస్..?
Updated on: Jul 29, 2024 | 3:47 PM

మ్యాటర్ బాగుండాలే కానీ.. బాక్సాఫీస్ దగ్గర కొత్త వాళ్లతో కూడా మెంటల్ ఎక్కించొచ్చు అని చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. అందులో మ్యాడ్ కూడా ఒకటి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లబించింది.

ఇదే దారిలో మరికొన్ని యూత్ ఫుల్ సినిమాలు దండయాత్రకు రెడీ అంటున్నాయి. అందులో ముందుగా వస్తున్న సినిమా కమిటీ కుర్రోళ్లు. నిహారిక కొణిదెల ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమాతో 20 మంది నటులు పరిచయం అవుతున్నారు.

తాజాగా విడుదలైన కమిటీ కుర్రోళ్లు ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఏదో కామెడీగా కాకుండా.. ఎమోషనల్ విలేజ్ డ్రామాను చూపిస్తున్నారు దర్శకుడు యధు వంశీ. ట్రైలర్ చూస్తుంటే కంటెంట్ కూడా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. ఆగస్ట్ 9న విడుదల కానుంది ఈ సినిమా.

మరోవైపు ఆయ్ కూడా పూర్తిగా యూత్ ఫుల్ కంటెంటే. పైగా గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా ఇది. కొత్త దర్శకుడు అంజి తెరకెక్కిస్తున్న ఆయ్ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. మ్యాడ్‌తో పిచ్చెక్కించిన నార్నె నితిన్ ఇందులో హీరో. నయన్ సారిక హీరోయిన్‌గా పరిచయవుతున్నారు.

ఆయ్ సినిమా కోసం ప్రమోషన్స్ అయితే కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి ఈ రెండు యూత్ ఫుల్ మూవీస్ వారం గ్యాప్‌లోనే బాక్సాఫీస్ దగ్గర దండయాత్రకు సిద్ధమవుతున్నాయి.




