- Telugu News Photo Gallery Cricket photos Australia Player Travis Head Hits 5 Consecutive Fifties In T20
T20 Cricket Records: రికార్డుల వర్షంతో రెచ్చిపోయిన కావ్య మారన్ టీం ప్లేయర్.. స్పెషల్ లిస్టులో మనోడే టాప్
Travis Head Hits 5 Consecutive Fifties In T20: టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ట్రావిడ్ హెడ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అది కూడా బ్యాక్ టు బ్యాక్ 5 అర్ధసెంచరీలు చేయడం విశేషం. అయితే ఈ రికార్డు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది భారత క్రికెటర్ అని మీకు తెలుసా?
Updated on: Jul 29, 2024 | 1:52 PM

Hits 5 Consecutive Fifties In T20: అమెరికాలో జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ వరుసగా 5 అర్ధ సెంచరీలు సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ తరపున ఆడిన హెడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో 54 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, ఆ తర్వాత ఎంఐ న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 54 పరుగులు చేశాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 22 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

అలాగే, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో 56, 77 పరుగులు చేశాడు. దీంతో వరుసగా 5 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.

ఐపీఎల్ 2019లో డేవిడ్ వార్నర్ వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన వార్నర్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో జరిగిన మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు సాధించాడు.

ఇప్పుడు అమెరికన్ T20 లీగ్‌లో ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్‌ల పేరిట వరుసగా ఐదు అర్ధ సెంచరీల ప్రత్యేక రికార్డును సమం చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన 2వ ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు.

టీ20 క్రికెట్‌లో వరుసగా అత్యధిక అర్ధశతకాలు సాధించిన ఆటగాడిగా రియాన్ పరాగ్ రికార్డు సృష్టించాడు. 2023లో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అస్సాం తరపున ఆడిన రియాన్.. వరుసగా 7 అర్ధశతకాలు సాధించి ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు.




