AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గుంత.. తీరా చూస్తే.. మూగజీవులకు నరకంగా మారింది

ఓ ఇంటి నిర్మాణంలో భాగంగా తవ్విన సెప్టిక్‌ ట్యాంక్‌ రోడ్డుపక్కనే ఉంది. దాని పక్కనే చెట్లు మొలిచి ఉండటంతో ఆ చెట్ల ఆకులను తినేందుకు వస్తున్న మూగజీవాలు ప్రమాదవశాత్తూ..

AP News: సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గుంత.. తీరా చూస్తే.. మూగజీవులకు నరకంగా మారింది
Representative Image
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 16, 2024 | 12:17 PM

Share

జనావాసాల మధ్య తిరిగే పశువులకు ఓ గుంత నరకాన్ని చూపిస్తోంది. ఆహారం కోసం సంచరించే ఆవులు, దూడలు ఆ గుంతలో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నాయి. ప్రతిసారి ఎవరో ఒకరు చూసి వాటిని ఆ గుంత నుంచి సురక్షితంగా బయటకు తీయాల్సి వస్తోంది. ఓ ఇంటి నిర్మాణంలో భాగంగా తవ్విన సెప్టిక్‌ ట్యాంక్‌ రోడ్డుపక్కనే ఉంది. దాని పక్కనే చెట్లు మొలిచి ఉండటంతో ఆ చెట్ల ఆకులను తినేందుకు వస్తున్న మూగజీవాలు ప్రమాదవశాత్తూ ఆ సెప్టిక్‌ ట్యాంక్‌లో పడిపోతున్నాయి. దీంతో వాటిని రక్షించేందుకు ఇటు కాలనీవాసులు, అటు ఫైర్‌ సిబ్బంది నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ ట్యాంక్‌పై మూత వేయండి మహాప్రభో అంటూ ఆ స్థల యజమానిని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రాజ్యలక్ష్మీ కాలనీ లేడీస్ హాస్టల్ వద్ద నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో రాత్రి ప్రమాదవశాత్తు ఓ దూడ పడిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు అరగంటకు పైగా శ్రమించి ఆ లేగ దూడను గుంతలో నుంచి వెలికి తీశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ ఆవు కూడా ఇలానే పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇంటి యజమాని చాలా రోజులుగా నిర్మాణం పూర్తి చేయకుండా ఇలానే ఉంచడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవు దూడను రక్షించిన అగ్నిమాపక శాఖ అధికారులను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్