Andhra Pradesh: అయ్యో పాపం..రోడ్డు బాగోలేదని నడిరోడ్డుపైనే బాలింతను వదిలి వెళ్లిన తల్లి బిడ్డ వాహన సిబ్బంది

అల్లూరి జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలింతను క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది ఆమెపట్ల కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారు. బాలింత గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టారు. దీంతో కొండలు గుట్టలు దాటుకుంటూ అతి కష్టం మీద ఇంటికి చేరింది. ఈ ఘటన జిల్లాలోని అనంతగిరి మండలంలో చోటు చేసుకుంది.

Andhra Pradesh: అయ్యో పాపం..రోడ్డు బాగోలేదని నడిరోడ్డుపైనే బాలింతను వదిలి వెళ్లిన తల్లి బిడ్డ వాహన సిబ్బంది
Talli Pillala Ambulance Service
Follow us

| Edited By: Surya Kala

Updated on: Nov 06, 2024 | 11:39 AM

పచ్చి బాలింతరాలను రోడ్డు బాగలేదని చెప్పి మూడు కిలోమీటర్ల దూరం నడిపించారు తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బంది. అనంతగిరి మండలం వాజంగికి చెందిన గర్భిణి జ్యోతి.. విశాఖ కేజీహెచ్ లో సిజేరియన్ తో బిడ్డను ప్రసవించింది. డిశ్చార్జ్ చేయడంతో ఆమె బిడ్డతో పాటు సొంతూరికి తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనంలో బయలుదేరింది. బాలింత ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో వాహన సిబ్బంది ఆమెను దింపేశారు. రోడ్డు బాగోలేదని సాకుతో వాహనం ఆపేశారు. దీంతో మూడు కిలోమీటర్ల దూరం పచ్చి బాలింతరాలు తీవ్ర అవస్థలు పడుతూ చంటి బిడ్డతో తన ఇంటికి అతి కష్టం మీద చేరింది.

గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం  చేశారు. మార్గమధ్యలో బాలింతరాలని దించివేయటమేంటని, తనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తీవ్ర ఆందోళన చెందారు. ప్రభుత్వం ఇటువంటి ఘటనలపై దృష్టి పెట్టి గర్భిణీలు బాలింతలకు కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..