AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mini India in US: అమెరికాలో ఈ నగరం మినీ ఇండియా.. డెమొక్రాటిక్ కోట.. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటే

అమెరికా రాష్ట్రం న్యూజెర్సీలో అధిక సంఖ్యలో భారతీయ ఓటర్లు నివసిస్తున్నారు. కొంతమంది దీనిని అమెరికా మినీ ఇండియాగా కూడా పరిగణిస్తారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన అత్యధిక జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. న్యూజెర్సీ జనాభాలో 4.6 శాతం మంది భారతీయులు.

Mini India in US: అమెరికాలో ఈ నగరం మినీ ఇండియా.. డెమొక్రాటిక్ కోట.. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటే
Mini India In Us
Surya Kala
|

Updated on: Nov 06, 2024 | 9:45 AM

Share

అమెరికా ఎన్నికల ఫలితలల్లో మొదటి నుంచి రిపబ్లికన్ అభ్యర్థులు, డెమొక్రటిక్ అభ్యర్థుల మధ్య పోటీ సమానంగానే సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భారతీయ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులిద్దరూ చేసిన ప్రయత్నాలు అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన ఓటర్లు ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తోంది. అమెరికా రాష్ట్రం న్యూజెర్సీలో అధిక సంఖ్యలో భారతీయ ఓటర్లు నివసిస్తున్నారు. కొంతమంది దీనిని అమెరికా మినీ ఇండియాగా కూడా పరిగణిస్తారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన అత్యధిక జనాభా ఇక్కడే నివసిస్తున్నారు. న్యూజెర్సీ జనాభాలో 4.6 శాతం మంది భారతీయులు. ఈ ఎన్నికల్లో కమలా హారిస్ ముందంజలో ఉన్నారు. డెమోక్రటిక్ అభ్యర్థిపై మరోసారి భారతీయ ఓటర్లు విశ్వాసం వ్యక్తం చేశారు.

న్యూజెర్సీ ఎందుకు ముఖ్యమైనదంటే

13 అసలైన కాలనీలలో ఒకటైన న్యూజెర్సీ డిసెంబర్ 1787లో అమెరికన్ యూనియన్‌లో చేరింది. న్యూజెర్సీ మొత్తం 59 US అధ్యక్ష ఎన్నికలలో పాల్గొంది. దాని జనాభా కారణంగా న్యూజెర్సీ రోడ్ ఐలాండ్ తర్వాత 14తో అత్యధిక ఎన్నికల ఓట్లను కలిగి ఉంది. గత 8 ఎన్నికల్లో న్యూజెర్సీ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థులు విజయం సాధించారు. 2020లో ఈ రాష్ట్రం నుంచి డోనాల్డ్ ట్రంప్ కంటే జో బిడెన్ 16 శాతం ఎక్కువ ఓట్లు సాధించారు. ఈసారి కూడా ట్రంప్‌పై కమలా హారిస్ దాదాపు 8 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

న్యూజెర్సీ ఎందుకు ఆసియా ప్రజల బలమైన కోటగా ఉందంటే

2001లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్‌తో సహా ఇతర రాష్ట్రాల కంటే న్యూజెర్సీలో దక్షిణాసియా నుంచి ఎన్నికైన అధికారులు ఎక్కువ మంది ఉన్నారు. న్యూజెర్సీలో భారతీయులు అధిక సంఖ్యలో ఉండటానికి కారణం న్యూయార్క్. న్యూయార్క్‌లో ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్నందున ఇక్కడ ఎక్కువ మంది ఆసియా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అమెరికాలోని ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ ఎక్కువ ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. న్యూయార్క్‌కు సమీపంలో ఉండటం తక్కువ పన్నులు, చౌకైన ఆస్తి మొదలైన కారణాలతో ప్రజలు న్యూయార్క్‌లో పనిచేస్తూ న్యూజెర్సీలో నివసించడానికి ఇష్టపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..