US Election 2024: బ్లూ, రెడ్​, స్వింగ్​ స్టేట్స్​ అంటే ఏంటి? ఏ స్టేట్స్‌ ప్రజలు అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తారో తెలుసా..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ తుది దశకు చేరుకుంది. ట్రంప్, కమలా హారీస్ ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ శిబిరం ఇప్పటి నుంచే తామే విజయాన్ని సాధిస్తామని ప్రకటిస్తోంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో తొలి ఎగ్జిట్ పోల్ విడుదలైంది. అయితే గత కొన్ని రోజులుగా ఎన్నికల విషయంలో ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. ఓటు వేయడానికి కొన్ని వారాల ముందు, ట్రంప్‌కు అకస్మాత్తుగా మద్దతు పెరగడం ప్రారంభమైం. ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ ఓటర్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా ఉద్భవించాయి. అమెరికాలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని దేశవ్యాప్తంగా 73 శాతం మంది ఓటర్లు ఆందోళన వ్యక్తం చేయగా, 25 శాతం మంది అది సురక్షితమని అభిప్రాయపడ్డారు.

US Election 2024: బ్లూ, రెడ్​, స్వింగ్​ స్టేట్స్​ అంటే ఏంటి? ఏ స్టేట్స్‌ ప్రజలు అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తారో తెలుసా..!
Us Presidential Election
Follow us
Surya Kala

|

Updated on: Nov 06, 2024 | 7:26 AM

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఆధిక్యాన్ని ప్రదర్శించినట్లు తొలి ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. 44 శాతం ఓటర్లు ట్రంప్‌కు అనుకూలమని భావిస్తుండగా, హారిస్‌కు 49 శాతం మద్దతు లభించింది. అయితే 2020తో పోలిస్తే ఇద్దరూ కొంచెం ఎక్కువ ప్రతికూల రేటింగ్‌లను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఎన్నికల నేపధ్యంలో బ్లూ, రెడ్​, స్వింగ్​ స్టేట్స్​అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు బ్లూ, రెడ్​, స్వింగ్​ స్టేట్స్​ అంటే ఏంటి? ఏ స్టేట్స్‌ ప్రజలు అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తారో తెలుసుకుందాం..

అమెరికాలో “బ్లూ స్టేట్స్​” అనేవి ప్రధానంగా డెమొక్రటిక్ అభ్యర్థులకు ఓటు వేస్తుంటాయి. “రెడ్​ స్టేట్స్​” రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. 2000 అధ్యక్ష ఎన్నికల సమయంలో టెలివిజన్ నెట్​వర్క్​లు ఎన్నికల ఫలితాలను సూచించడానికి కలర్-కోడెడ్​ మ్యాప్​లను ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుంచి ఇది కొనసాగుతోంది.

కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్ లాంటి రాష్ట్రాలను బ్లూ స్టేట్స్​గా భావిస్తారు. ఈ రాష్ట్రాలు ప్రగతిశీల విధానాలకు మద్దతు ఇస్తాయి, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తాయి. తరచుగా వారి రాజకీయ ఎజెండాలను నడిపించే అర్బన్​ సెంటర్స్​ని కలిగి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇక టెక్సాస్, అలబామా, వ్యోమింగ్ వంటి రాష్ట్రాలను రెడ్​ స్టేట్స్​గా వర్గీకరించడం జరిగింది. ఈ ప్రాంతాలు తరచుగా సంప్రదాయవాద విలువలు, వ్యక్తిగత స్వేచ్ఛలు, పరిమిత ప్రభుత్వ జోక్యానికి ప్రాధాన్యత ఇస్తాయి. ఇవి వారి ప్రధానంగా గ్రామీణ, శివారు జనాభా ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి.

అలాగే ఆరిజోనా, జార్జియా, మిషిగాన్​, నెవాడా, నార్త్​ కారోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిల్‌ రాష్ట్రాలను స్వింగ్​ స్టేట్స్​ అంటారు. ఈ రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ఎవరికి ఓటు వేస్తారన్నది నిత్యం ఉత్కంఠే! అభ్యర్థుల గెలుపోటములు వీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..