AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2024 US elections: అమెరికా ప్రెసిడెంట్‌గా ఎవరు గెలిస్తే మనకు మేలు

అమెరికా ప్రెసిడెంట్‌గా ఎవరు గెలిస్తే మనకు మేలు. ఎవరు వస్తే మన విద్యార్థులకు స్టూడెంట్‌ వీసాలు పెరుగుతాయి? ట్రంప్‌ గెలిస్తే...H1-B వీసాల విషయంలో చిక్కులు తప్పవా? ఈ విషయంలో ట్రంప్‌ కంటే హారిస్‌ బెటరా?

2024 US elections: అమెరికా ప్రెసిడెంట్‌గా ఎవరు గెలిస్తే మనకు మేలు
Trump Vs Harris
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2024 | 7:02 AM

Share

అమెరికాలో ఎవరు అధ్యక్షుడు అయితే మనకేంటి అంటే…చాలానే ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌లో మునిగితేలే మన విద్యార్థులకు స్టూడెంట్‌ వీసాల నుంచి, ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించే H1B వీసాల దాకా, నిబంధనలు సరళతరంగా ఉంటేనే మనోళ్లకు మేలు జరుగుతుంది. అయితే గతంలో ట్రంప్‌ అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు, H1B వీసాల విషయంలో నిబంధనలను కఠినతరం చేయడంతో ఇండియన్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌ ఇబ్బందులు పడ్డారు. ఇక మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా, భారతీయులు మన ఉద్యోగాలు దొంగిలిస్తున్నారంటూ అమెరికన్లను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు.

ఇక ఆర్థిక వ్యహారాల్లో కూడా ఇండియాపై ట్రంప్‌ కఠిన వైఖరినే ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వస్తే విదేశీ వలసదారులపై కఠిన వైఖరి తప్పేలా లేదు. అయితే మనకు శత్రువు లాంటి చైనాకు ట్రంప్‌ బద్ధ వ్యతిరేకిగా ఉన్నారు. ఇక పాకిస్తాన్‌ అంటే కూడా ట్రంప్‌కు పెద్దగా నచ్చదు. దీంతో పాక్ ప్రజలు డెమోక్రాట్ల గెలుపునే కోరుకుంటున్నారు. ట్రంప్ గెలిస్తే చైనాపై పోరులో భారత్‌కు అమెరికా మద్దతు లభించే అవకాశం ఉంది. ఇక చైనా, పాకిస్తాన్ పట్ల డెమోక్రాట్లు పెద్దగా వ్యతిరేకంగా కనిపించడం లేదు. మరోవైపు మన ప్రధాని మోదీకి ట్రంప్‌ మంచి స్నేహితుడు. మన ఇరుగుపొరుగు దేశాల విషయంలో కానీ, అంతర్జాతీయ వ్యవహారాల్లో కానీ ట్రంప్‌ ప్రెసిడెంట్ అయితే మనకు బెటర్‌. కానీ మన విద్యార్థులకు, ఐటీ ఎంప్లాయీస్‌కు నష్టం తప్పదనే భయాలు ఉన్నాయి. ఇక డెమోక్రాట్లు గెలిస్తే మన వాళ్ల ఉద్యోగాలకు ఢోకా ఉండదు. ఇక తాను గెలిస్తే రష్యాతో ఒప్పందం కుదుర్చుకునేలా ఒత్తిడి తెస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. మరోవైపు ట్రంప్ గెలిస్తే.. చైనా, ఇరాన్.. అమెరికాకు శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి. హారిస్ అధ్యక్షురాలైతే రష్యా నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇజ్రాయెల్ విషయంలో మాత్రం ఇద్దరు అభ్యర్థుల తీరు ఒకేలా ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి