US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల తంతు ఎలా ఉంటుందో తెల్సా..?

బిగ్ బ్రదర్ దేశం... అమెరికాలో ఎన్నికలు... ప్రపంచదేశాల్లో జరిగే ఎన్నికలు ఒక ఎత్తైతే.. అమెరికాలో జరిగే ఎన్నికలు ఒక ఎత్తు.. మరి అధ్యక్ష ఎన్నికల తంతు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల తంతు ఎలా ఉంటుందో తెల్సా..?
Kamala Harris Vs Donald Trump
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 06, 2024 | 6:50 AM

అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఆయా రాష్ట్రాల్లో అధ్యక్ష అభ్యర్థిని నామినేట్ చేసే ప్రక్రియలు కాక్యూసెస్, ప్రైమరీలతో ప్రారంభమవుతుంది. అధ్యక్ష ఎన్నికల తేదీకి 6 నుంచి 9 నెలల ముందుగా ఈ ప్రక్రియ మొదలవుతుంది. కాక్యూసెస్, ప్రైమరీలు అంటే.. ఆయా పార్టీల్లో జరిగే అంతర్గత ఎంపిక ప్రక్రియలు. ఆయా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియలో తొలుత డెలిగేట్స్‌ను పార్టీలు ఎంపికచేసుకుంటాయి. ఈ డెలిగేట్స్ నేషనల్ కన్వెన్షన్‌లో పాల్గొని ప్రెసిడెన్షియల్ అభ్యర్థిని నామినేట్ చేస్తారు.

ఈ ఏడాది మార్చి 12న జరిగిన నేషనల్ కన్వెన్షన్ పోల్‌లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ పొందడానికి ఎనిమిదిమంది పోటీ పడ్డారు. 2268 డెలిగేట్స్‌ మద్దతుతో ట్రంప్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా నామినేషన్ పొందారు. డెమోక్రటిక్ పార్టీలో ఆరుగురుపోటీపడగా జో బైడెన్ 3896 డెలిగేట్స్‌ మద్దతుతో అధ్యక్ష అభ్యర్థిగా మరోసారి నామినేట్ అయ్యారు. అయితే… అనంతరం అనారోగ్య కారణంతో బరిలో నుంచి తప్పుకోవడంతో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచారు.

ఎలక్టోరల్ కాలేజీలోని ఎలక్టోర్స్‌ను ఓటర్లు ఎన్నుకుంటారు. వీరంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మనదేశంలోని పార్లమెంట్‌ మాదిరిగా అక్కడ కాంగ్రెస్ ఉంటుంది.. కాంగ్రెస్‌లో రెండు సభలుంటాయి.. ఎగువ సభ సెనేట్ కాగా దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. ఈ రెండు సభల్లోని సభ్యులను ఎలక్టోర్స్‌గా పిలుస్తారు.. ఈరెండు సభల్లో మొత్తం 538 మంది సభ్యులుంటారు. ఒక అభ్యర్థి, అధ్యక్షుడిగా గెలవాలంటే కనీసం 270 ఎలక్టోర్స్ ఓట్లు పొందాల్సుంటుంది.

హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పదవీ కాలం రెండేళ్లు. వీరిని ప్రతీ రెండేళ్లకోసారి ఎన్నుంటారు. వాషింగ్టన్ డీసీకున్న ముగ్గురు ఎలక్టోర్లతో కలిపి మొత్తం 438 మంది ప్రతినిధులను వోటర్లు ఇప్పుడు ఎన్నుకుంటున్నారు. ప్రతీ రాష్ట్రం ఎలక్టోర్లను ఎంపికచేసుకునే తీరు వేరువేరుగా ఉంటుంది. ఆయా పార్టీలకందిస్తున్న సేవలు, వారీ నిజాయితీ, ఉన్నత ప్రమాణాలున్న వ్యక్తులు పార్టీలవారీగా ఎంపికవుతుంటారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సంఖ్య జనాభా ప్రాతిపదికన ప్రతీ రాష్ట్రానికి కేటాయిస్తారు.

ఎగువసభ సెనేట్‌ గురించి తెలుసుకుందాం.. ఈ సభలో 100 మంది సభ్యులుంటారు. వీరి పదవీకాలం ఆరేళ్లు.. ప్రతీ రెండేళ్లకోసారి 1/3వంతు మంది పదవీ విరమణ చేస్తారు. అదేసమయంలో కొత్త సభ్యులను ఎన్నుకుంటారు. ప్రతీ రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు ఉంటారు. వీరిని కూడా ఓటర్లు ఎన్నుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో 438 హౌస్‌ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌తో పాటుగా 33 మంది సెనేటర్లు(ఎలక్టోర్స్‌ను) ఓటర్లు ఎన్నుకోనున్నారు.

ఎలక్టోర్స్‌ను ఆయా పార్టీలు రాష్ట్రాలవారీగా ఎంపిక చేసుకోవడం లేదా పార్టీ సెంట్రల్ కమిటీ రాష్ట్రాల వారీగా నామినేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత లేదా మాజీ పార్టీ అధికారుల నుంచి, కాంగ్రెస్ సభ్యులు, పార్టీ కార్యకర్తలనుంచి స్లేట్ ఎలక్టోర్స్‌ను నామినేట్ చేస్తాయి. చివరగా వీరిని స్టేట్ పార్టీ కన్వెన్షన్లు లేదా సెంట్రల్ పార్టీ కమిటీ కన్వెన్షన్ల ద్వారా ఎంపిక చేసుకుంటాయి. ప్రతీ అధ్యక్ష అభ్యర్థికి వేరువేరుగా ఎలక్టోర్స్ పేర్లతో కూడిన స్లేట్(ప్యానెల్) ఉంటుంది.

ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే.. ఓటర్లు తమ రాష్ట్రాల ఎలక్టోర్స్‌కు నేరుగా ఓటేయలేరు. తమ స్టేట్ ఎలక్టోర్స్‌ను ఎన్నుకునేందుకు వోటర్లు పోలింగ్ రోజున ఓటర్లు తమకు నచ్చిన అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేస్తారు. అధ్యక్ష అభ్యర్థి ప్యానెల్‌ను స్లేట్‌గా పిలుస్తారు. బ్యాలెట్ పేపర్లో బరిలో ఉన్నఅధ్యక్ష అభ్యర్థి పేరు కింద ఎలక్టోర్స్ పేర్లు ఉంటాయి.. బ్యాలెట్ పేపర్లు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటాయి. గెలిచిన అధ్యక్ష అభ్యర్థి స్లేట్‌ (ప్యానెల్) అభ్యర్థులు ఎలక్టోర్స్‌గా నియమితులవుతారు. అనంతరం డిసెంబర్ నెలలో రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారంనాడు జరిగే సమావేశంలో ఎలక్టోర్స్‌ ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఆయా రాష్ట్రాల్లో తమ రాష్ట్రాల్లో నమోదైన పాపులర్ ఓట్ల ప్రకారం ఎన్నికైన ఎలక్టోర్స్ అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటును తమ పార్టీ అభ్యర్థికి కాకుండా ఇతర పార్టీ అభ్యర్థికి వేయడమనేది చాలా అరుదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!