Delhi Air Pollution: ఢిల్లీలో డేంజర్‌ బెల్స్‌.. యమునా నదిపై వెల్లువలా తెల్లటి నురగ.. రేపటి నుంచి ఛట్ పూజ ప్రారంభం

ఢిల్లీని పొరుగు భయం వెంటాడుతోంది. ఇప్పటికే.. హర్యానా, పంజాబ్‌ నుంచి వచ్చే పొగ ఢిల్లీ ప్రజలకు ఊపిరాడకుండా చేస్తుంటే.. తాజాగా.. యూపీ నుంచి వస్తోన్న విషపు నురుగ మరింత భయపెడుతోంది. ప్రాణాంతక రసాయనాల ఇన్‌ఫ్లోతో దేశ రాజధానిలోని యుమనా నది వణికిపోతోంది. రేపటి నుంచి ఛట్ పూజ ప్రారంభం కానుండడంతో విషపు నురగతో కూడిన యమునా ప్రవాహం.. మహిళలను కంగారు పెడుతోంది. అటు.. బీజేపీ, ఆప్‌ మధ్య నురగ రాజకీయంగా కాక రేపుతోంది.

Delhi Air Pollution: ఢిల్లీలో డేంజర్‌ బెల్స్‌.. యమునా నదిపై వెల్లువలా తెల్లటి నురగ.. రేపటి నుంచి ఛట్ పూజ ప్రారంభం
Delhi Air Pollution
Follow us

|

Updated on: Nov 06, 2024 | 7:09 AM

దేశ రాజధాని ఢిల్లీలో డేంజర్‌ బెల్స్‌ మోగుతూనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యర్థాలతో అనార్థాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే.. కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటంతో గాలి నాణ్యత మరింత క్షీణించిపోయింది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని పొగ, కాలుష్యం కమ్మేస్తోంది. ఫలితంగా.. కళ్లు మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇప్పుడు ఢిల్లీకి మరో కష్టమొచ్చి పడింది. ఢిల్లీలోని యమునా నదిపై ప్రమాదకర తెల్లటి నురగ వెల్లువలా ప్రవహిస్తుండడం ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే.. దీనికి కారణం.. ప్రమాదకర రసాయనాలు యమునా నదిలో కలవడమేనని కారణమంటున్నారు నిపుణులు.

కళ్లు మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు

ఢిల్లీ ప్రజలతోపాటు చుట్టుపక్కలవారు వ్యర్థాలను విడుదల చేయడం, నదీ తీరంలోని పరిశ్రమల నుంచి కూడా కెమికల్స్‌ రిలీజ్‌ చేస్తు్న్నట్లు చెప్తున్నారు. దాంతో.. యమునా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా.. శ్వాసకోశ, చర్మ సమస్యలతో సహా, మరిన్ని అనారోగ్యాలను కలిగించేలా అమ్మోనియా ఫాస్ఫేట్‌లను కలిగిన నురగ.. యమునా నీటిలో అధికంగా ఉన్నట్లు తేలడం మరింత కంగారు పెడుతోంది.

రేపటి నుంచి ఉత్తరాదిలో ఛట్ పూజ ప్రారంభం

ఇదిలావుంటే.. ఉత్తరాది ప్రజల పవిత్రమైన ఛట్‌ పూజ పండగ వేళ యమునానదిలో నురగ భారీగా వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. రేపటి నుంచి ఛట్ పూజ ప్రారంభం కానుండగా.. విషపు నురగతో నిండిన యమునను చూసి మహిళలు భయంపడుతున్నారు. ప్రాణాంతక వ్యాధులు గ్యారెంటీ అంటున్న నిపుణల హెచ్చరికలతో షాక్‌ అవుతున్నారు. అయితే.. తెలంగాణలో మూసీ పునరుజ్జీవం వ్యవహారం.. కాంగ్రెస్‌కి.. బీఆర్ఎస్‌ మధ్య ఎంత రచ్చరేపుతోందో.. సేమ్ సీన్ ఇప్పుడు ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్య రిపీట్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

యమున నదిలో పుణ్యస్నానాలు ఆచరించి సూర్యభగవాణుడ్ని ప్రార్థించడం, 36గంటలు ఉపవాసం ఉండి నదీతీరంలోనే పూజలు చెయ్యడం అనవాయితీ. దాంతో.. పై ఎత్తున యూపీ నుంచి యమునా నదిలో కెమికల్స్‌ యాడ్‌ అవకుండా చూడాలని సీఎం యోగీకి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ సీఎం ఆతిశీ. ఈ క్రతువుకి ఏ మాత్రం ఆంటంకం లేకుండా యమున ఘాట్‌లలో విషపు నురుగును తొలగిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఢిల్లీ సీఎం ఆతిశీ ప్రకటన మేర ఆప్ అధికార యంత్రాంగం నురగను తొలగించే పనులు కూడా చేపట్టింది. అయితే.. కెమికల్‌ తీవ్రతను తగ్గించి నురగను కనుమరుగు చేసేలా జెట్‌ స్ర్పేలూ చేస్తున్నప్పటికీ.. ఏ మాత్రం ఉపయోగం లేదు అన్నట్లు మారింది పరిస్థితి.

నదిలో పుణ్యస్నానం చెయ్యడం ఎలా?

ఇక.. నురగ ప్రవాహంతో నదిలో పుణ్యస్నానం చెయ్యడం ఎలా?.. విషపునురగతో వచ్చేది పుణ్యమా.. రోగమా? అంటూ ఢిల్లీ సహా యమున పరివాహకంలోని మహిళలు ప్రశ్నిస్తున్నారు. అదేసమయంలో.. ఢిల్లీ వాసులకు మీరిచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆప్‌ను టార్గెట్ చేస్తోంది బీజేపీ. ఇక.. రాజకీయం ఎలా ఉన్నా.. ఛట్‌ పూజ నేపథ్యంలో మహిళల సెంటిమెంట్ చాలా కీలకం. ఆరునూరైనా ఛట్‌పూజకు యమునలో దిగేందుకే మొగ్గు చూపుతారు. ఇప్పుడే కాదు.. గత నాలుగైదేళ్లుగా ఈ సీజన్‌లో నురగ మధ్యే పుణ్యస్నానాలు చేస్తున్నారు.

అయితే.. విషపు నురగ శరీరానికి తాగినా, పొరపాటున నోట్లోకి వెళ్లినా వచ్చే రోగాలు మామూలుగా ఉండవని వార్నింగ్‌ ఇస్తున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. స్కిన్ క్యాన్సర్‌, టీబీ, మెదడు సంబంధిత వ్యాధులు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌ తప్పవంటున్నారు. మొత్తంగా.. రేపటి నుంచి యమునా నది తీరాన ప్రారంభమయ్యే ఛట్ పూజలు ఎలా సాగుతాయి.. యమునానది తీరంలోని నురగపై బీజేపీ, ఆప్‌ రాజకీయం ఏ స్టేజ్‌కు చేరుతోందో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రేపటినుంచి ఛట్ పూజ ప్రారంభం యమునలో స్నానం వ్యాధులు గ్యారెంటీ..!
రేపటినుంచి ఛట్ పూజ ప్రారంభం యమునలో స్నానం వ్యాధులు గ్యారెంటీ..!
మల్లీశ్వరి సినిమాలోని డైనింగ్ టేబుల్ స్టోరీ తెలిస్తే షాకే..
మల్లీశ్వరి సినిమాలోని డైనింగ్ టేబుల్ స్టోరీ తెలిస్తే షాకే..
అమెరికా ప్రెసిడెంట్‌గా ఎవరు గెలిస్తే మనకు మేలు
అమెరికా ప్రెసిడెంట్‌గా ఎవరు గెలిస్తే మనకు మేలు
బాలీవుడ్‌ సినిమాలో పృథ్వీరాజ్.. ఆ స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్
బాలీవుడ్‌ సినిమాలో పృథ్వీరాజ్.. ఆ స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్
రైల్వేలో 18,799 లోకోపైలట్ పోస్టులు.. అందుబాటులోకి మాక్‌ టెస్టులు
రైల్వేలో 18,799 లోకోపైలట్ పోస్టులు.. అందుబాటులోకి మాక్‌ టెస్టులు
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే
అమెరికా అధ్యక్ష ఎన్నికల విశేషాలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల విశేషాలు..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!