Tulasi Vivaham: తులసి వివాహం రోజున ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదో తెలుసుకోండి..

తులసి వివాహం హిందూ మతంలో ఒక ముఖ్యమైన ఆచారం. తులసి మొక్కకు శాలిగ్రామ శిలతో వివాహం జరిగిన సమయం ఇది. ఈ వివాహం ప్రకృతి, దేవుని మధ్య పవిత్ర బంధాన్ని సూచిస్తుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం అవసరం.

Tulasi Vivaham: తులసి వివాహం రోజున ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదో తెలుసుకోండి..
Tulasi Vivaham
Follow us
Surya Kala

|

Updated on: Nov 06, 2024 | 9:03 AM

తులసి వివాహం హిందూ మతంలో ఒక ముఖ్యమైన, పవిత్రమైన పండుగ. కార్తీక మాసంలో దీపావళి తర్వాత జరుపుకునే ప్రత్యేక పండగ. తులసి మొక్కకు ప్రత్యేక పూజలు చేసి వివాహం జరిపిస్తారు. తులసి వివాహం ప్రత్యేకంగా కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిధి రోజున నిర్వహిస్తారు. తులసిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా.. సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. ప్రతికూల శక్తులు నాశనమవుతాయి. శాలిగ్రామ శిల విష్ణుమూర్తికి ప్రతీక. అందువల్ల ఈ ప్రత్యేకమైన రోజున ఈ ఇద్దరికి వివాహం జరపడం ద్వారా.. భక్తులు ధార్మిక పుణ్యాన్ని పొందుతారు. తులసి వివాహం రోజున ఏమి చేయాలి.. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదో తెలుసుకుందాం..

తులసి 2024 వివాహ తేదీ

వేద పంచాంగం ప్రకారం కార్తీక మాసం ద్వాదశి తిథి మంగళవారం నవంబర్ 12 సాయంత్రం 4:02 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి నవంబర్ 13 బుధవారం మధ్యాహ్నం 1:01 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని పరిగణలోకి తీసుకుని నవంబర్ 13న తులసి వివాహాన్ని జరుపుతారు.

తులసి వివాహం రోజున ఏమి చేయాలంటే

  1. తులసి వివాహం చేసే రోజున.. పూజకు ముందు తులసి మొక్కను బాగా కడిగి శుభ్రం చేయాలి. తులసి దళాలను తీసి శుభ్రమైన నీటితో కడగాలి. తర్వాత తులసిని పసుపు, కుంకుమ, చందనంతో అలంకరించండి.
  2. శాలిగ్రామ రాయిని గంగాజలంతో కడిగి శుభ్రం చేసి, తులసి ఆకులతో అలంకరించండి.
  3. ఇవి కూడా చదవండి
  4. తులసి వివాహం కోసం ఒక చిన్న మండపాన్ని రెడీ చేసి అలంకరించండి. మండపాన్ని పూలతో అలంకరించి తులసి మొక్క సమీపంలో అందమైన ముగ్గులతో అలంకరించండి.
  5. దీపం, అగరుబత్తీలు, ధూపం, బియ్యం, పువ్వులు, పండ్లు మొదలైన పూజకు అవసరమైన అన్ని వస్తువులను సేకరించండి.
  6. వివాహ సమయంలో మంత్రాలు జపించండి. పూజ విధానం, చదవాల్సిన కథ కోసం పండితులను పిలవ వచ్చు.
  7. తులసి వివాహానంతరం దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. పేదలకు ఆహారం లేదా బట్టలు దానం చేయడం శుభ ప్రదం.

తులసి వివాహం రోజున ఏమి చేయకూడదంటే

  1. తులసి పెళ్లి రోజున తులసి దళాలను తీయకూడదు.
  2. తులసి మొక్కకు పెళ్లి రోజున మాంసం, చేపలు, గుడ్లు, మద్యం సేవించకూడదు. ఈ రోజున స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి.
  3. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. ఈ రోజు ఎవరితోనూ వాదన చేయకుండా దూరంగా ఉండండి.
  4. పెళ్లి రోజున ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ రోజు పూర్తి భక్తితో పూజ చేయండి.

తులసి వివాహం ప్రాముఖ్యత..

తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. ఆమె సంపద, శ్రేయస్సు, ఆనందం, శాంతికి అధిదేవత. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ నశిస్తుంది. శాలిగ్రామ శిల విష్ణు స్వరూపంగా పరిగణించబడుతుంది. దేవతలందరికీ అధిపతి విష్ణువు. తులసి వివాహం రోజున ఈ రెండింటినీ పూజించడం వల్ల శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది. నమ్మకం ప్రకారం తులసి మొక్కకు వివాహం జరిపించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.