Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ నెల 8, 9 తేదీల్లో పలు ఆర్జిత సేవలు రద్దు.. ఎందుకంటే

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈనెల 9వ తేదీన పలు ఆర్జిత సేవలను టీటీడీ చేసింది. ఈ నెల శ్రీవారికి ఈ పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్న నేపధ్యంలో కల్యాణోత్సవం, ఉంజల్‌ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేసింది. అంతేకాదు తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్ప యాగానికి అంకురార్పణ ముందు రోజు అంటే ఈ నెల 8 వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 8వ తేదీ సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకార సేవను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ నెల 8, 9 తేదీల్లో పలు ఆర్జిత సేవలు రద్దు.. ఎందుకంటే
Pushpa Yagam
Follow us
Surya Kala

|

Updated on: Nov 06, 2024 | 1:35 PM

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈనెల 9వ తేదీన పలు ఆర్జిత సేవలను టీటీడీ చేసింది. ఈ నెల శ్రీవారికి ఈ పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్న నేపధ్యంలో కల్యాణోత్సవం, ఉంజల్‌ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేసింది. అంతేకాదు తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్పయాగానికి అంకురార్పణ ముందు రోజు అంటే ఈ నెల 8 వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 8వ తేదీ సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకార సేవను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.

కలియుగ దైవంగా పూజలను అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉంటుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరతారు. ఈ నెల 9వ తేదీన కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి వేడుకగా పుష్పార్చన నిర్వహించనున్నారు. ఈ పుష్పయాగాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. పుష్పయాగానికి అంకురార్పణ, పుష్పయాగం సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ పుష్పయాగం సందర్భంగా స్వామివారికి రెండో అర్చన, రెండో గంట, నైవేద్యాలు సమర్పించనున్నారు.

పుష్ప యాగంలో భాగంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో అభిషేకం చేయనున్నారు. తర్వాత వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కార్తీక మాసం, శనివారం నేపధ్యంలో స్వామివారికి జరిగే పుష్పయాగంలో పాల్గొనడానికి, శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే