Uthana Ekadashi: డబ్బు కొరతతో ఇబ్బందులు పడుతున్నారా.. కార్తీక ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి.. శుభ ఫలితాలు మీ సొంతం..

ఉత్థాన ఏకాదశిని కార్తీక మాసంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా శ్రీ మహా విష్ణువుతో పాటు లక్ష్మీ దేవి ఆశీర్వాదాన్ని కూడా పొందుతారని జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదని నమ్ముతారు.

Uthana Ekadashi: డబ్బు కొరతతో ఇబ్బందులు పడుతున్నారా.. కార్తీక ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి.. శుభ ఫలితాలు మీ సొంతం..
Ekadashi
Follow us
Surya Kala

|

Updated on: Nov 06, 2024 | 8:16 AM

పంచాంగం ప్రకారం ఉత్థాన ఏకాదశి ఉపవాసం కార్తీక మాసంలో శుక్ల పక్షం ఏకాదశి తిధిన పాటించబడుతుంది. సంవత్సరంలోని అన్ని ఏకాదశి తిథిలలో ఈ ఏకాదశి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువు 4 నెలల యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఉత్థాన ఏకాదశి తర్వాత తర్వాత పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ రోజున నియమ నిష్టల ప్రకారం శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. ఉత్థాన ఏకాదశి శ్రీమహావిష్ణువును పూజించడంతో పాటు కొన్ని నియమాలను పాటించడం ద్వారా మనిషి జీవితంలో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు.

ఉత్థాన ఏకాదశి తేదీ శుభ సమయం

వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి 11 నవంబర్ 2024 సాయంత్రం 6.46 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి నవంబర్ 12, 2024 సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఉత్థాన ఏకాదశి ఉపవాసం నవంబర్ 12వ తేదీ మంగళవారం నాడు ఆచరిస్తారు.

ఇవి కూడా చదవండి

చేయాల్సిన చర్యలు ఏమిటంటే

ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి స్నానపు నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం ఆ వ్యక్తిపై ఉంటుందని నమ్ముతారు.

కెరీర్‌లో ఏడుగుదల కోసం

కెరీర్ లేదా వ్యాపారంలో అడ్డంకులు ఏర్పడుతుంటే దేవుత్తని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు కుంకుమపువ్వు పాలతో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

వివాహ అవకాశాల కోసం

ఎవరైనా వివాహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. వారు కార్తీక మాస ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించే సమయంలో కుంకుమ, పసుపు లేదా చందనంతో తిలకం దిద్ది పూజ చేయాలి. పసుపు పుష్పాలను శ్రీ హరికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల తొందరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు.

రుణ విముక్తి కోసం

రుణ విముక్తి పొందాలంటే ఉత్థాన ఏకాదశి రోజున రావి చెట్టుకు నీరు సమర్పించండి. దీని తరువాత సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించండి. ఈ చర్యలను అనుసరించడం ద్వారా ఎవరైనా అప్పులతో ఇబ్బంది పడుతుంటే వారు త్వరలో అప్పుల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.

డబ్బుకు లోటు ఉండదు

కార్తీకమాసంలో తులసి పూజకు విశేషమైన విశిష్టత ఉంది. ఉత్థాన ఏకాదశి రోజున తులసి మొక్కలో చెరుకు రసం కలిపి నైవేద్యంగా పెట్టండి. దీని తరువాత దేశీ నెయ్యితో దీపం వెలిగించి, తులసి మొక్కకు హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మనిషికి ఎప్పుడూ డబ్బు కొరత ఉందని జీవితంలో ఆర్ధిక కష్టాలన్నీ దూరమవుతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.