Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Politics: ఏపీ అసెంబ్లీ పరిణామాలపై నారా ఫ్యామిలీ ఫైర్.. సంచలన కామెంట్స్ చేసిన రోహిత్..

Nara Rohit - AP Politics: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం నాడు చోటు చేసుకున్న పరిణామాలపై నారా కుటుంబ సభ్యులు,

Andhra Pradesh Politics: ఏపీ అసెంబ్లీ పరిణామాలపై నారా ఫ్యామిలీ ఫైర్.. సంచలన కామెంట్స్ చేసిన రోహిత్..
Nara Rohit
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2021 | 6:43 PM

Nara Rohit – AP Politics: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం నాడు చోటు చేసుకున్న పరిణామాలపై నారా కుటుంబ సభ్యులు, నందమూరి ఫ్యామిలీ తీవ్రంగా స్పందిస్తున్నారు. నిన్నటి ఘటనను ముక్తకంఠంతో ఖండిస్తూ.. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇంతకు ముందే జూనియర్ ఎన్టీఆర్ ఈ అంశంపై స్పందించి.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించగా.. తాజాగా నారా రోహిత్ స్పందించాడు. అయితే, రోహిత్ చాలా ఘాటుగా స్పందించారు. ఏపీలోని వైసీపీ సర్కార్ తీరును తూర్పారబట్టాడు. అసెంబ్లీలో పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ నిప్పులు చెరిగాడు. వైసీపీ నాయకుల మాటలు క్షమార్హం కానివి అన్నాడు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాడు.

ఈ ప్రకటన యధావిధంగా.. ‘‘ఉన్నత విలువలతో, ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో శుక్రవారం నాడు కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా.. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ను, ఆయన సతీమణి భువనేశ్వరిని అసభ్యపదజాలంతో దూషించడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి కానీ, కుటుంబ సభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును దుర్వినియోగం చేసి నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉండటం వల్లే మీ మనుగడ సాగింది. ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉండటం వల్లే సంయమనంతో ఉన్నాం. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్లు నిన్నటితో మీ వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక మీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారు. ఈ వికృ క్రీడలను వెనకుండి ఆడిస్తున్న వారు కూడా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి స్థాయిలేని వ్యక్తుల మధ్య మీరు రాజకీయం చేయాల్సి రావటం దురదృష్టకరం పెదనాన్న, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటాం.’’ అని నారా రోహిత్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.

Also read:

Bangarraju: అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్.. ఫస్ట్ లుక్, టీజర్‏తో బంగార్రాజు సందడి..

Naga Chaitanya: ఇది నా జీవితానికి గ్రీన్‌ సిగ్నల్‌ లాంటిది.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన నాగచైతన్య..

Faria Abdullah : ముద్దమందారం ఈ మనోహరి రూపం.. చిట్టి అందానికి కుర్రాళ్ళు అవ్వకుండా ఉండగలరా దాసోహం..