Palnadu Politics: ‘మారాను కాబట్టే వాళ్లంతా బతుకుతున్నారు’.. పల్నాడులో మళ్లీ కత్తులు దూస్తున్న రాజకీయం..
పల్నాడు రాజకీయం మళ్లీ ఒక్కసారిగా హీటెక్కింది.. మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాటల తూటాలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు.
పల్నాడు రాజకీయం మళ్లీ ఒక్కసారిగా హీటెక్కింది.. మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాటల తూటాలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు. తాను మారిపోయాను కాబట్టే వాళ్లంతా బతుకుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కాసు మహేశ్‌రెడ్డిలాంటి వాళ్లు తనకు వెంట్రుకతో సమానమని మండిపడ్డారు. పల్నాడులో రక్తపాతం ఇంకెన్నాళ్లని యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇకనైనా మారకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. పాత శీనునైతే దుస్తులు విప్పి నడిరోడ్డుపై కొట్టేవాడినంటూ యరపతినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మారాను కాబట్టే బతుకుతున్నారన్నారు.
కాగా, యరపతినేని మాటలకు కాసు మహేష్‌రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. యరపతినేనిలాంటి బచ్చాగాళ్లను తాను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానని అటు గురుజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి అన్నారు. నన్నే ఎదిరించలేని వాడు పులివెందులో పోటీ చేస్తాడట అని యరపతినేనిని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకులు ఉండటం మన కర్మ అని కాసు మహేశ్‌రెడ్డి అన్నారు. ఎవరైనా తమ జోలికి వస్తే తాటా తీస్తానని మహేశ్ రెడ్డి హెచ్చరించారు.
151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్‌తో పోటీపడగలరా..? అంటూ కాసు యరపతినేనిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు పులివెందులలో పోటీ అంటా అంటూ ఎద్దెవా చేశారు. ఇలాంటి వాళ్లను చిన్నప్పటి నుంచి చాలా మందిని చూశానంటూ పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..