Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Birthday: టోన్ మారింది.. ట్వీట్ మారింది.. బాబు గారికి సాయిరెడ్డి బర్త్ డే విషెస్ చూశారా

Happy Birthday Chandrababu Naidu: ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పేరు చెబితే అంతెత్తున ఎగిరిపడే విజయసాయి రెడ్డి స్వరం మార్చారు. చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్ వేదికగా తిట్ల దండకం వినిపిస్తూ నెటిజన్ల నోళ్లలో నానిన విజయసాయి స్వరంలో వచ్చిన మార్పును చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

Chandrababu Birthday: టోన్ మారింది.. ట్వీట్ మారింది.. బాబు గారికి సాయిరెడ్డి బర్త్ డే విషెస్ చూశారా
Vijayasai Reddy - Chandrababu Naidu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 20, 2023 | 12:04 PM

Happy Birthday Chandrababu Naidu:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ యమ హాటు గురు..! అనేలా ఉంటాయి.. మళ్లీ అంతే స్వీటు గురు..! అనేలా మారుతాయి కూడా.. అందుకే.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు.. ఇది పాలిటిక్స్ గురించి అవగాహన ఉన్నవారు తరచుగా చెబుతుంటారు. ఏదీ ఏమైనా.. కొన్ని విషయాలు ఎంతో లోతుగా ఆలోచించేలా చేస్తాయి. బద్ద శుత్రువులు.. తిట్టుకున్నవారు పలకరించుకుంటే.. ఎలా ఉంటుంది..? చూసే వారికి హాయిగా ఉంటుంది.. ఇక గిట్టని వారికి కంటగింపు కలిగిస్తుంది. అదే ఓ నేత పుట్టినరోజునాడు.. ఎప్పూడు ఫైర్ అయ్యే మరొక నేత శుభాకాంక్షలు చెబితే ఎలా ఉంటుంది.. దీనినే క్యూట్ పాలిటిక్స్ అంటారు. కొందరికి నచ్చొచ్చు.. మరికొందరికీ నచ్చకపోవచ్చు.. తాజాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా.. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు చెప్పిన విషయం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం శుభాకాంక్షలు తెలిపి.. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేసి విషెస్ తెలిపారు. ‘‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని విజయసాయి ట్వీట్ చేశారు. అయితే, విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Vijayasai Reddy - Chandrababu Naidu

Vijayasai Reddy – Chandrababu Naidu

ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పేరు చెబితే అంతెత్తున ఎగిరిపడే విజయసాయి రెడ్డి.. స్వరంలో మార్పు రావడమే దీనికి కారణం. చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్ వేదికగా తిట్ల దండకం వినిపిస్తూ నెటిజన్ల నోళ్లలో నానిన విజయసాయి స్వరంలో వచ్చిన మార్పును చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అయితే, లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించడం.. ఆసమయంలో విజయసాయిరెడ్డి.. చంద్రబాబు కుటుంబానికి దగ్గరైన విషయం తెలిసిందే. ఆసుపత్రి దగ్గరి నుంచి.. అంత్యక్రియల వరకు నందమూరి, నారా కుటుంబంతో కలిసి విజయసాయిరెడ్డి చేదొడువాదోడుగా నిలిచారు. రాజకీయాలు వేరు.. బంధుత్వం వేరు అనే విధంగా విజయసాయి వ్యవహరించిన తీరుపై పలువురు ఆయన్ను అభినందించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కాని విజయసాయిరెడ్డి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా ఆయన ట్వీట్లు చేయడాన్ని కూడా దాదాపుగా నిలిపివేశారు. ఈ క్రమంలో బర్త్ డే విషెష్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.. రాజకీయాల్లో జరిగే ప్రతి అనూహ్య పరిణామం వెనుక.. ఏదో వ్యూహం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. విజయసాయి వ్యవహారంలోనూ తాజా పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే దీన్ని రాజకీయ దృష్టిలో చూడాల్సిన అవసరం లేదన్నది కొందరి వాదన. ఇది రాజకీయాల్లో హుందాతనాన్ని పెంచేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

విజయసాయిరెడ్డి ట్వీట్..

అటు చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ చెబుతూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్‌పై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. ఆయన తీరులో మార్పు వచ్చిందంటూ కామెంట్ చేశారు. గతంలో ఆయన చంద్రబాబుకు జన్మదిన విషెస్ చెప్పిన తీరును.. ఇప్పుడు విషెస్‌ను పోల్చుతూ మీరు మారిపోయారు సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మేము మేము తన్నుకున్నా పర్వాలేదు.. మీరు మాత్రం బాగుండాలా? ఇదేమి న్యాయమం సాయి గారూ అంటూ మరో వైసీపీ కార్యకర్త సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

రాజకీయాలను పక్కనబెట్టి చంద్రబాబుకు విజయసాయి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం హుందాగా ఉందంటూ మరికొందను నెటిజన్లు స్పందిస్తున్నారు. మీలో వచ్చిన ఈ మార్పు నిజంగా.. సంతోషకరమంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. తొలిసారిగా మీ ట్వీట్ నచ్చిందంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు సైతం విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు రీట్విట్ చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..