AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: త్వరలోనే సంచలన ప్రకటన చేయబోతున్నా: టీడీపీ అధినేత చంద్రబాబు

వాళ (ఏప్రిల్‌ 20) చంద్రబాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మార్కాపురంలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టీడీపీ శ్రేణులు. అనంతరం మహిళలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు..

Chandrababu Naidu: త్వరలోనే సంచలన ప్రకటన చేయబోతున్నా: టీడీపీ అధినేత చంద్రబాబు
Chandrababu Naidu
Basha Shek
|

Updated on: Apr 20, 2023 | 1:28 PM

Share

మార్కాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కాగా ఇవాళ (ఏప్రిల్‌ 20) చంద్రబాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మార్కాపురంలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టీడీపీ శ్రేణులు. అనంతరం మహిళలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఎన్ఆర్‌ఐ శిరీషను ప్రత్యేకంగా అభినందించారు. ‘ ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌ 65వ నగరంగా ఉంది. ఎక్కువగా ధనికులు ఉన్నారు. ఒకప్పుడు నేను నాటిన విత్తనం ఇప్పుడు అభివృద్ది చెందింది. హైటెక్‌ సిటీలో శిక్షణ పొంది అమెరికాలో మగవాళ్లతో సమానంగా వేతనం తీసుకుంటున్న శిరీష అభినందనీయురాలు. తెలుగువారు అమెరికాలో ఇతర దేశస్తులకంటే సమర్ధవంతంగా పనిచేసి ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలు తెలుగుగడ్డ రుణం తీర్చుకోవాలి. రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్‌పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఎన్‌టిఆర్‌ తొలిసారి మహిళలకు 8 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారు. ఆస్థిలో మహిళలకు సమానహక్కు తీసుకువచ్చారు. ఉద్యోగాల్లో, కాలేజిల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టాం. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది టీడీపీ సంకల్పం.’

‘ మార్కాపురం పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక ప్రకటన చేయబోతున్నా. ఎస్‌సీలపై దాడులు, అంటరానితనంపై జస్టిస్‌ పున్నయ్య కమిటీ సూచనలు అమలు చేశాం. ఎస్సీ, ఎస్టీలకు గౌరవం కల్పించిన పార్టీ టీడీపీ. వైసీపీ ప్రభుత్వం దళితులపై దాడులు చేసి తప్పుడు కేసులు పెడుతున్నారు. గురజాలలో యువతిపై మానభంగం జరిగితే 24 గంటల్లో పట్టుకోవాలని 22 టాస్క్‌పోర్స్‌ సిబ్బందిని నియమిస్తే నిందితుడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే కాకినాడలో ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపి మృతదేహాన్ని ఇంటికి పంపారు. నిందితుడు బెయిల్‌పై వస్తే ఊరేగింపు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..