Andhra Pradesh: పాస్టర్ పైత్యం.. దెయ్యాలతో నాట్యం.. రంగంలోకి పోలీసులు..

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో పాస్టర్ రత్నకుమార్‌ వ్యవహారంపై టీవీ9 కథనాలతో పోలీసులు స్పాట్‌కెళ్లారు. స్థానికుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే స్థానికులు మాత్రం పాస్టర్ రత్నకుమార్‌ దెయ్యాలు, బూతాలంటూ హడావుడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: పాస్టర్ పైత్యం.. దెయ్యాలతో నాట్యం.. రంగంలోకి పోలీసులు..
Pastor Ghosts Drama in Penuganchiprolu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 20, 2023 | 1:56 PM

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో పాస్టర్ రత్నకుమార్‌ వ్యవహారంపై టీవీ9 కథనాలతో పోలీసులు స్పాట్‌కెళ్లారు. స్థానికుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే స్థానికులు మాత్రం పాస్టర్ రత్నకుమార్‌ దెయ్యాలు, బూతాలంటూ హడావుడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల్లో ఉంటూ దెయ్యాల్ని తరిమితే అవి ఎక్కడికి వెళ్తాయో చెప్పాలని పాస్టర్‌ను నిలదీశారు. ఆత్మలతో మాట్లాడుతా.. ప్రార్థనలతో దెయ్యాల్ని దౌడ్ తీయిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు పాస్టర్‌ రత్నాకర్‌. అదంతా అబద్దమని టీవీ9 నిఘాలో బట్టబయలైంది. ఇదే విషయాన్ని రత్నకుమార్‌ను అడిగితే తాను చేసే నిర్వాకాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.

రత్నకుమార్‌ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. లేని దెయ్యాలను వదిలిస్తానని నమ్మించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీ9 కథనాలతో స్పాట్‌కు పోలీసులు చేరుకున్నారు. స్థానికుల్ని వివరాలు అడిగి తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. పాస్టర్ ముసుగులో రత్నాకర్ చేస్తున్న మోసాలు టీవీ9 స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలయ్యాయి.

అయితే, దెయ్యం అంటే భయపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు.. దెయ్యం భయంతో ఊర్లు ఖాళీచేసి వెళ్లిపోయే జనాలు కూడా ఉన్నారు. ఇక దెయ్యాల పేరు చెప్పుకొని డబ్బులు దండుకునే వాళ్ళు, జనాలను భయపెట్టే వాళ్లు సైతం ఉన్నారు. ఇదిగో దెయ్యం.. అదిగో దెయ్యం అంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు దండుకునే వారితో ఇప్పటికైనా జాగ్రత్త పడండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..