AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Arrest: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీకోర్టు ధర్మాసనం.. తిరిగి విచారణను శుక్రవారానికి (అక్టోబర్ 20) కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

Chandrababu Arrest: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
Chandrababu Cases
Shaik Madar Saheb
|

Updated on: Oct 17, 2023 | 5:19 PM

Share

స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీకోర్టు ధర్మాసనం.. తిరిగి విచారణను శుక్రవారానికి (అక్టోబర్ 20) కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. వాదనలు మిగిలిఉంటే.. రాతపూర్వకంగా ఇవ్వాలంటూ ధర్మాసనం సూచించింది. కాగా.. చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాది హరీష్‌ సాల్వే, సీఐడీ తరుపున ముకుల్‌ రోహత్గీ సుధీర్ఘ వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 17A వర్తించదని సీఐడీ తరపున వాదనలు వినిపించిన ముకుల్‌ రోహత్గీ అన్నారు. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు వాదనలు సాగాయి. దాదాపు గంటన్నర సేపు ఆయన తుదివాదనలు వినిపించారు. వివిధ హైకోర్టులిచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. అవినీతిపరులను కాపాడేందుకు 17A అన్నది రక్షణ కవచం కాదని రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు వర్తించకపోయినా IPCలోని అనేక సెక్షన్ల కింద అభియోగాలున్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపు అనేది లేదని, అనేక దర్యాప్తు సంస్థలు దీనిపై విచారణ జరుపుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

17A సెక్షన్‌ తర్వాత అమల్లోకి వచ్చినా అది కచ్చితంగా ఈ కేసులో వర్తిస్తుందని బాబు తరపున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు ఇలాంటివి ఉపయోగిస్తున్నారని అన్నారు. రెట్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌ గురించి అనేక సెక్షన్లు, తీర్పులను హరీష్‌ సాల్వే ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు సుదీర్ఘంగా సాగడంతో ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అంత వరకు అరెస్టు చేయొద్దని గతంలో చేసిన సూచనలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.