Andhra Pradesh: కాకినాడలో ఘోరం.. పనికి వెళ్లొస్తూ ఆరుగురు మహిళల దుర్మరణం..
Kakinada Road Accident: కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Kakinada Road Accident: కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రైవేట్ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. ఆటోను ప్రైవేట్ బస్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని ఆస్పత్రికి తరలించామని స్థానికులు తెలిపారు. బస్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది.. మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డాయి. ప్రైవేట్ బస్ ఢీ కొన్న సమయంలో ఆటోలో ఎనిమిది మంది ఉన్నారు..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతోపాటు.. మృతుల వివరాలు తెలయాల్సి ఉంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..
