AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు.. వచ్చే 3 రోజులు మండే ఎండలు.. లేటెస్ట్ వెదర్ బులిటెన్

మాంచి మిడ్ సమ్మర్ వచ్చేసింది. ఆంధ్రాలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఇక కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ప్రూట్ జ్యూసులు ఎక్కువగా తీసుకోండి.

Andhra Pradesh: ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు.. వచ్చే 3 రోజులు మండే ఎండలు.. లేటెస్ట్ వెదర్ బులిటెన్
Heatwave Alert In Andhra
Ram Naramaneni
|

Updated on: May 14, 2023 | 3:36 PM

Share

ఆంధ్రప్రదేశ్,  యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పడమటి గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో  రాబోవు మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై పలు సూచనలు చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఆ వివరాలు దిగువన తెలుసుకుందాం.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

ఆదివారం :- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° C వరకు పెరగవచ్చు.

సోమవారం :- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° C వరకు పెరగవచ్చు.

మంగళవారం:- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° C వరకు పెరగవచ్చు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

ఆదివారం :-  వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° C వరకు పెరగవచ్చు

సోమవారం : వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° C వరకు పెరగవచ్చు.

మంగళవారం:-  వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° C వరకు పెరగవచ్చు.

రాయలసీమ :-

ఆదివారం :-  వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది . గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° C వరకు పెరగవచ్చు.

సోమవారం :  వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° C వరకు పెరగవచ్చు.

మంగళవారం:-  వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది . గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° C వరకు పెరగవచ్చు.

ఆదివారం 136 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని, మరో 173 మండలాల్లో దీని ప్రభావం ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చింది. ప్రధానంగా విజయనగరం, పార్వతీపురం మన్యంజిల్లా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుజిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇక శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనంతపురం, శ్రీ సత్యసాయిజిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్‌ ఉంది. మొత్తానికి ఏపీలో భానుడి భగభగతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.

మయన్మార్‌, బంగ్లాదేశ్‌ దిశగా ప్రయాణిస్తున్న మోచా తుపాను ప్రభావం నేరుగా రాష్ట్రంపై లేనప్పటికీ.. పరోక్షంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైంది. దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల తీవ్రత కూడా అధికమయింది. గాలిలో తేమ శాతం తగ్గిపోయి, పొడివాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఉష్ణతాపాన్ని తట్టుకోలేక పిల్లలు, వృద్ధులు, మహిళలు అల్లాడిపోతున్నారు. మరోవైపు వచ్చే మూడు రోజుల్లో వడగాలుల ప్రభావం మరింత అధికం కానుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..