AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తను చంపేందుకు కి’లేడి’ పక్కా ప్లాన్.. బంపర్ ఆఫర్ కొట్టేద్దామనుకుంటే భారీ షాక్..

వివాహేతర సంబంధాలతో భర్తను హత్య చేయడం ఈ మధ్య పరిపాటిగా మారిపోయింది. అయితే ఈ హత్యను మాత్రం కిలాడి లేడీ చాలా ప్లాన్‎గా పర్ఫెక్ట్‎గా చేసింది. భర్తను చంపాలి అని నిర్ణయించుకుని అతనిపై 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయించింది. ప్రియుడితో కలిసి కాటికి పంపించి యాక్సిడెంట్‎గా చిత్రీకరించింది. ఈ క్రమంలోనే పోలీసులను నమ్మించే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా బుక్కై కటకటాల పాలైంది.

భర్తను చంపేందుకు కి'లేడి' పక్కా ప్లాన్.. బంపర్ ఆఫర్ కొట్టేద్దామనుకుంటే భారీ షాక్..
Wife Kills Husband
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Apr 13, 2024 | 7:16 AM

Share

వివాహేతర సంబంధాలతో భర్తను హత్య చేయడం ఈ మధ్య పరిపాటిగా మారిపోయింది. అయితే ఈ హత్యను మాత్రం కిలాడి లేడీ చాలా ప్లాన్‎గా పర్ఫెక్ట్‎గా చేసింది. భర్తను చంపాలి అని నిర్ణయించుకుని అతనిపై 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయించింది. ప్రియుడితో కలిసి కాటికి పంపించి యాక్సిడెంట్‎గా చిత్రీకరించింది. ఈ క్రమంలోనే పోలీసులను నమ్మించే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా బుక్కై కటకటాల పాలైంది.

వివాహేతర సంబంధానికి అలవాటు పడిన మాధవి అనే మహిళ తన భర్త రాంబాబును ప్రియుడు భరత్‎తో కలిసి హత్య చేసింది. భరత్‎తో తనకున్న వివాహేతర సంబంధం భర్త రాంబాబుకు తెలిసిపోవడం.. రాంబాబు రోజు మాధవిని చిత్రహింసలకు గురిచేస్తుండడంతో ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి పక్కా స్కెచ్ గీసింది. భర్తను చంపాలని నిర్ణయించుకున్న తర్వాత రాంబాబు‎పై రూ.20 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ కూడా చేయించింది. ఈ క్రమంలో మాధవి తన తల్లి సపోర్టు కూడా తీసుకొని మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి రాంబాబును హత్య చేసింది. అయితే దీనంతటిని ఆక్సిడెంట్‎గా చిత్రీకరించి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేయసింది. కానీ పోలీసులు మాధవి తీరుపై అనుమానం రావడంతో కేసును పూర్తిగా దర్యాప్తు చేయగా అసలు హంతకురాలు భార్యేనని పోలీసులు తేల్చారు. ఆమెకు ప్రియుడు భరత్, మాధవి తల్లి కూడా సహకరించారని వారితో పాటు మరో ముగ్గురు వ్యక్తుల సహాయం తీసుకొని భర్తను యాక్సిడెంట్ చేయించి చంపించిందని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

కిలాడీ లేడి చేసిన హత్యపై జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్ మాట్లాడుతూ.. వివాహేతర సంబంధంతో రాంబాబు అనే వ్యక్తిని భార్యే హత్య చేసిందని, చంపేముందు భర్తపేరుపై రూ.20లక్షల ఇన్సూరెన్స్ చేయించిందన్నారు. హత్యకు ఆమె తల్లి, ఆమె ప్రియుడు మరో ముగ్గురు వ్యక్తులు సహకరించారని డీఎస్పీ తెలిపారు. మృతుడు ఎర్రగుంట్ల పట్టణంలోని ప్రశాంతి నగర్ నివాసం ఉంటున్నాడని, గత రెండు సంవత్సరాలుగా మృతుని భార్య మాధవితో భరత్ బాబు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు భార్యను మానసికంగా వేధింపులకు గురిచేస్తుండటంతో భార్య మాధవి ఆమె తల్లి కలిసి రాంబాబును అడ్డు తొలగించుకోవాలని పధకం ప్రకారం రాంబాబును హత్య చేసినట్లు వివరించారు. ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి దగ్గర ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించారని.. నిందుతులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..