AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Scam: సీబీఐ కస్టడీకి కవిత.. మూడు రోజుల పాటు విచారించనున్న సీబీఐ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ కస్టడీ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దాంతో.. ఏఫ్రిల్ 13, 14, 15 తేదీల్లో కవితను కస్టడీకి తీసుకోనుంది సీబీఐ.

Delhi Liquor Scam: సీబీఐ కస్టడీకి కవిత.. మూడు రోజుల పాటు విచారించనున్న సీబీఐ
Kavitha Cbi Custody
Balaraju Goud
|

Updated on: Apr 12, 2024 | 5:13 PM

Share

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ కస్టడీ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దాంతో.. ఏఫ్రిల్ 13, 14, 15 తేదీల్లో కవితను కస్టడీకి తీసుకోనుంది సీబీఐ. అలాగే.. కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో కాసేపట్లో కవితను సీబీఐ హెడ్‌ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. ఇక, ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కవితను కలిసేందుకు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను అనుమతి ఇచ్చింది ఢిల్లీ కోర్టు.

మరోవైపు.. కవితకు ఢిల్లీ కోర్టులో వరుసగా నిరాశ ఎదురవుతోంది. కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్, సీబీఐ కస్టడీ పిటిషన్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్లు వేయగా.. ఆ రెండింటినీ తిరస్కరించింది.

దక్షిణ భారతదేశానికి చెందిన ఒక మద్యం వ్యాపారి లైసెన్స్‌లను పొందేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని, AAP మాజీ కమ్యూనికేషన్స్ చీఫ్ విజయ్ నాయర్‌తో సహా కవిత ఇతరుల ద్వారా చెల్లింపులను సమన్వయం చేసుకోవాలని చెప్పారని సీబీఐ ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కవితను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది ఢిల్లీ కోర్టు. ఇక సీబీఐ కస్టడీ, అరెస్ట్‌పై కవిత పెట్టుకున్న పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో మార్చి నెలలో అరెస్టయిన బీఆర్ఎస్ నాయకురాలు కవితను మూడు రోజుల పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కస్టడీకి పంపింది. సంబంధిత మనీలాండరింగ్ కేసులో ఆమె గతంలో ఏప్రిల్ 23 వరకు ఢిల్లీలోని తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తీహార్‌ జైలులో ఉన్న ఆమెను గురువారం సాయంత్రం సీబీఐ అరెస్ట్ చేసింది.

మద్యం లైసెన్సుల కోసం ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు లంచం ఇచ్చే పథకంలో సాక్షి స్టేట్‌మెంట్‌లు, వాట్సాప్ చాట్‌లు, ఆర్థిక పత్రాలు ఆమెను ప్రధాన కుట్రదారు అని వాదిస్తూ, ఐదు రోజుల పాటు కవితను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే