Varanasi: ప్రధానమంత్రి మోదీపై ట్రాన్స్‌జెండర్ పోటీ.. మహామండలేశ్వర్ హేమాంగి సఖి ఎవరంటే?
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అఖిల భారత హిందూ మహాసభ పోటీకి సిద్ధమైంది. తమ పార్టీ తరుఫున మహామండలేశ్వర్ హిమాంగి సఖిని బరిలోకి దింపుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నమోదీని సవాలు చేసేందుకు హిమాంగి సఖి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. మార్చి 27న ఉత్తరప్రదేశ్‌లోని 20 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను మహాసభ ఉత్తరప్రదేశ్ శాక ప్రకటించింది.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అఖిల భారత హిందూ మహాసభ పోటీకి సిద్ధమైంది. తమ పార్టీ తరుఫున మహామండలేశ్వర్ హిమాంగి సఖిని బరిలోకి దింపుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నమోదీని సవాలు చేసేందుకు హిమాంగి సఖి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. మార్చి 27న ఉత్తరప్రదేశ్‌లోని 20 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను మహాసభ ఉత్తరప్రదేశ్ శాక ప్రకటించింది. వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ట్రాన్స్‌జెండర్ మహామండలేశ్వర్ హిమాంగి సఖి పేరును ఖరారు చేసింది. ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం ఎన్నికలం రంగంలోకి దిగినట్లు హిమాంగి సఖి తెలిపారు.
దేశవ్యాప్తంగా జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ఏడో దశలో ఓటింగ్ జరగనుంది. చివరి రౌండ్‌లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంపై ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇక తాజాగా నరేంద్ర మోడీపై పోటీ చేస్తానని కిన్నార్ మహామండలేశ్వర్ హిమాంగి సఖి ప్రకటించడంతో ఇది మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
హిమాంగి సఖి వారణాసి నుంచి అఖిల భారత హిందూ మహాసభ తరపున ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. హిందూ మహాసభ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు, రిషి కుమార్ త్రివేది హిమాంగి సఖి పేరును ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని 20 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఆయన ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్‌లోని 24 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించామని ఆయన చెప్పారు. హిమాంగి సఖీ జీ స్వయంగా వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకున్నారని, ఆమె కూడా బాబా విశ్వనాథ్ భక్తురాలని రిషి త్రివేది చెప్పారు.
వారణాసి నుంచి అఖిల భారత హిందూ మహాసభ అభ్యర్థిగా బరిలోకి దిగిన హిమాంగి సఖీ తొలిసారిగా కిన్నర్ సామాజికవర్గం తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. నేటికీ లింగమార్పిడి సమాజం యాచించడం ద్వారా లేదా వ్యభిచారం చేయడం ద్వారా జీవనోపాధి పొందవలసి వస్తుంది. ట్రాన్స్‌జెండర్ల ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ఎలాంటి మార్గం చూపలేదని హిమాంగి సఖి ఆరోపించారు. ఏప్రిల్ 12న తాను కాశీకి వెళతానని, బాబా విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆమె చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




