Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సినిమా తరహాలో స్కెచ్.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తిపడి బుక్ అయ్యాడు..!

సినిమాల్లో మర్డర్ మిస్టరీలను మించిన స్టోరీ ఇది. నంద్యాల జిల్లాలో జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తిపడి బుక్ అయ్యాడు. పాములపాడుకు చెందిన వ్యక్తి ప్రముఖ దర్శకుడు కాకపోయినా అంతకంటే మించి హాలీవుడ్ తరహాలో ఓ మర్డర్ కు ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. తానే సజీవ దహనం అయినట్లు అందరినీ నమ్మించి చివరకు ఓ అమాయకుడిని సజీవ దహనం చేసిన సంఘటన నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది.

Andhra Pradesh: సినిమా తరహాలో స్కెచ్.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తిపడి బుక్ అయ్యాడు..!
Death
Follow us
J Y Nagi Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Apr 12, 2024 | 4:26 PM

సినిమాల్లో మర్డర్ మిస్టరీలను మించిన స్టోరీ ఇది. నంద్యాల జిల్లాలో జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తిపడి బుక్ అయ్యాడు. పాములపాడుకు చెందిన వ్యక్తి ప్రముఖ దర్శకుడు కాకపోయినా అంతకంటే మించి హాలీవుడ్ తరహాలో ఓ మర్డర్ కు ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. తానే సజీవ దహనం అయినట్లు అందరినీ నమ్మించి చివరకు ఓ అమాయకుడిని సజీవ దహనం చేసిన సంఘటన నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది.

నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలోని ఏకే ట్రేడర్స్ ధాన్యం నిలువచేసిన మినీ గోదాంలో నిర్వహిస్తున్నాడు. ఉన్నట్టుండి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మార్చి 1వ తారీకు రాత్రి గోదాం దగ్ధమైంది. ఇది సాధారణ విషయంగా భావించిన ప్రజలు, పోలీసులు మంటలు చల్లార్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో గోదాములో పూర్తిగా కాలిపోయి సజీవ దహనమైన ఓ పురుషుని మృతదేహం బయటపడింది. దీంతో ఏకే ట్రేడర్స్ యజమాని వడ్ల ఫారుక్ భాషా మంటల్లో సజీవ దహనం అయ్యాడని కుటుంబ సభ్యులు రోదించారు. పోస్టుమార్టం అనంతరం రాత్రికి రాత్రి మృతదేహాన్ని సమీప ఈద్గా లోని శ్మశాన వాటికలో పూడ్చి వేసి చేతులు దులుపుకున్నారు.

అయితే అక్కడ ఓ ట్వి్స్ట్ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ ఒకటవ తేదీ రాత్రి సజీవ దహనమైన వడ్ల ఫారుక్ భాషా కాకినాడలో ప్రత్యక్షమయ్యాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి కళ్ళముందు కనిపించడంతో పాములపాడులోని కొందరు పలకరించే ప్రయత్నం చేయగా పారిపోయినట్లు సమాచారం. ఈ విషయం పాములపాడులోని వీరి కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు తెలిసింది. దీంతో పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. గోదాంలో సజీవ దహనమైన వ్యక్తి ఎవరు అనేది మిస్టరీగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

సజీవ దహనం మిస్టరీ కేసు కొత్త మలుపు తిరిగింది. కాకినాడలో ప్రత్యక్షంగా ఫారూఖ్ భాషాను చూసామని పాములపాడు లోని కొందరు బహిరంగంగా వారి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అసలు గుట్టరట్టు చేశారు. ఏకే ట్రేడర్స్ యజమాని వడ్ల ఫారూఖ్ భాషా అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోయాడు. అప్పుల నుంచి బయటపడేందుకు తనకు తానుగా సజీవ దహనం అయ్యానని నాటకానికి తెర లేపాడు. ఇందులో భాగంగానే మండల కేంద్రం పాములపాడుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెలిమిళ్ళ గ్రామంలో ప్రతాప్‌ను ఎంచుకున్నాడు బాషా. గత కొంతకాలంగా ప్రతాప్ ఆరోగ్యం బాగులేదు. కాస్త మతిస్థిమితం కోల్పోయి పాములపాడులో తిరిగేవాడు. మతిస్థిమితం లేని ప్రతాప్‌ను గోదాము వద్దకు తీసుకువచ్చి మద్యంలో విషపూరిత గుళికలు కలిపి తాగించాడు బాషా. గోదాములోకి తీసుకువెళ్లి, పెట్రోల్ పోసి అంటించి అదృశ్యం అయ్యాడని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు కూడా సేకరించారు. ఒకటో తేదీ రాత్రి వడ్ల ఫారుక్ భాషా స్థానిక పెట్రోల్ బంకు వద్ద బాటిల్‌లో పెట్రోలు నింపుకొని తీసుకు వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.

ఈ సంఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పాములపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సజీవ దహనమైన వ్యక్తిని ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయకుండా రాత్రికి రాత్రి గోనెపట్టలో చుట్టుకుని పోయి పూడ్చి పెట్టారని స్థానికులు చెబుతున్నారు. నడుముకు మొలతాడు ఉందని, వీటి ఆధారంగా సజీవ దహనమైన వ్యక్తి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వడ్ల ఫరూక్ భాషాగా ఎలా నిర్ధారిస్తారని ఆ మతానికి చెందిన మత పెద్దలే చెప్పారన్నారు. పోలీసులు సేకరించిన మృతదేహంపై ఉన్న దుస్తులు తన భర్త వేనని మృతుడు ప్రతాప్ భార్య నిర్ధారించింది. కాగా ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసలు.. నిందితుడు ఫారుక్ భాషా కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…