ఏపీలో కూటమి ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు.. ఎన్డీఏ నేతల భేటీలో కీలక అంశాలపై చర్చ..

ఆంధ్రప్రదేశ్‎ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న ఎన్డీయే కూటమి.. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు తర్వాత కూటమిలో మొదలైన అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో కూటమి పార్టీల అభ్యర్థుల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థులకు సహకరించేది లేదని మిత్రపక్షాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఏపీలో కూటమి ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు.. ఎన్డీఏ నేతల భేటీలో కీలక అంశాలపై చర్చ..
Ap Elections
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 13, 2024 | 8:30 AM

ఆంధ్రప్రదేశ్‎ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న ఎన్డీయే కూటమి.. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు తర్వాత కూటమిలో మొదలైన అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో కూటమి పార్టీల అభ్యర్థుల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థులకు సహకరించేది లేదని మిత్రపక్షాల నేతలు స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికి మూడు పార్టీల మధ్య సమన్వయం సరైన విధంగా లేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ పూర్తిస్థాయిలో జరుగుతుందా లేదా అనే అనుమానంతో మూడు పార్టీల నేతలు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు సహకరిస్తామని అసంతృప్తులు చెబుతున్నప్పటికీ.. వారి నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఏ విధంగా ఉంటుందోనని అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ సమస్యను అధిగమించడంపై మూడు పార్టీలు నేతలు దృష్టి సారించారు. మరోవైపు అసంతృప్తి ఎక్కువగా ఉన్న స్థానాల్లో పలుచోట్ల సీట్ల మార్పుపైనా కూటమి నేతలు ఫొటోస్ పెట్టారు. ఎన్నికలకు మరో నెల రోజులు మాత్రమే గడువు ఉండడంతో పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. సమన్వయ కమిటీలు ఏర్పాటు, ఓట్ల బదిలీ, ఉమ్మడి ప్రచారంపై చర్చించారు.

కూటమి ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు..

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ పార్టీల ముఖ్య నేతల సమావేశం జరిగింది. సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీమంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించిన కూటమి నేతలు.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం బూత్ లెవల్, అసెంబ్లీ లెవల్ నుంచి పార్లమెంట్ లెవల్ వరకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం, ఎన్నికల నిర్వహణ వ్యవహారాలను పరిశీలించేందుకు, వ్యూహాలను సిద్దం చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఓట్ల బదిలీపై క్షేత్ర స్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా మూడు పార్టీల నేతలు చర్చించారు. చాలా ప్రాంతాల్లో నేతలు మంచి సమన్వయంతో వెళుతున్నారని.. ఇది మంచి పరిణామం అని నేతలు అభిప్రాయ పడ్డారు.

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగిన కూటమి సభల గ్రాండ్ సక్సెస్‎పై సంతృప్తి వ్యక్తం చేసిన నేతలు.. ఉమ్మడి సభలు కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చాయని అభిప్రాయపడ్డారు. సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే తరహా ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్‎కు ఉమ్మడిగా ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేసేలా.. ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతూ.. రియల్ టైంలో సమస్యలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రూపొందించనున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీతో సహా అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. మూడు పార్టీల పొత్తును ప్రజలు స్వాగతించారని.. అధికార పార్టీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని నేతలు అభిప్రాయపడ్డారు. 25 పార్లమెంట్ సీట్లు, 160 పైగా అసెంబ్లీ సీట్లు గెలుపే లక్ష్యంగా ప్రచారం, ప్రణాళిక ఉండేలా వ్యూహంతో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..