చంద్రబాబుకు ఓటేస్తే జరుగుతున్న మంచి ఆగుతుంది.. విపక్ష కూటమిపై సీఎం జగన్ ఫైర్..
ఏపీ సీఎం జగన్ బస్సుయాత్ర శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో కృష్ణా జిల్లా నేతలు జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇడుపులపాయలో మొదలైన సీఎం జగన్ బస్సుయాత్ర శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో కృష్ణా జిల్లా నేతలు జగన్‌కు..

ఏపీ సీఎం జగన్ బస్సుయాత్ర శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో కృష్ణా జిల్లా నేతలు జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇడుపులపాయలో మొదలైన సీఎం జగన్ బస్సుయాత్ర శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో కృష్ణా జిల్లా నేతలు జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. నగరంలో మేమంతా సిద్ధం యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
శుక్రవారం గుంటూరు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనం పలికారు. ధూళిపాళ్ల నుంచి మొదలై సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు, చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు సాగింది. ఏటుకూరు బైపాస్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్… విపక్ష కూటమిపై ధ్వజమెత్తారు. జగన్‌కు ఓటు వేయడమంటే 58 నెలల మంచిని కొనసాగించడమే అని.. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే జరుగుతున్న మంచి ఆగిపోతుందన్నారు. ఏటుకూరు సభలో వైసీపీ అభ్యర్థులను పరిచయం చేసిన సీఎం జగన్.. మంగళగిరిలో స్థానికంగా ఉండే లావణ్యను గెలిపించాలని కోరారు. విడదల రజినీ హీరోకు ఏ మాత్రం తక్కువకాదన్నారు.
సభ తరువాత తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు సీఎం జగన్. శనివారం సీఎం జగన్ బస్సుయాత్ర కాజా, మంగళగిరి బైపాస్ మీదుగా సాగనుంది. CK కన్వెన్షన్ దగ్గర చేనేత కార్మికులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. తరువాత తాడేపల్లి, వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్‌కు చేరుకుంటారు ఏపీ సీఎం. రాత్రి ఇక్కడే బస చేస్తారు.




