AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఇంటి నిర్మాణానికి ఇసుక ఆర్డరిస్తే.. డెలివరీ వచ్చింది చూడగా కళ్లు బైర్లు!

ఇంటి నిర్మాణం కోసం ఇసుక ఆర్డర్‌ ఇచ్చాడు రాంబాబు. ఇంటి పునాదుల్లో ఇసుక పోసేందుకు ఓ పది ట్రాక్టర్ల దువ్వ కావాలని ఇసుక సప్లయ్‌ చేస్తున్న ఓ వ్యక్తికి పురమాయించాడు. అనుకున్నట్టుగానే పది ట్రాక్టర్ల ఇసుక శుక్రవారం సాయంత్రానికి ఇంటి ముందు పోశారు.

AP News: ఇంటి నిర్మాణానికి ఇసుక ఆర్డరిస్తే.. డెలివరీ వచ్చింది చూడగా కళ్లు బైర్లు!
Representative Image
Fairoz Baig
| Edited By: |

Updated on: Apr 12, 2024 | 9:07 PM

Share

ఇంటి నిర్మాణం కోసం ఇసుక ఆర్డర్‌ ఇచ్చాడు రాంబాబు. ఇంటి పునాదుల్లో ఇసుక పోసేందుకు ఓ పది ట్రాక్టర్ల దువ్వ కావాలని ఇసుక సప్లయ్‌ చేస్తున్న ఓ వ్యక్తికి పురమాయించాడు. అనుకున్నట్టుగానే పది ట్రాక్టర్ల ఇసుక శుక్రవారం సాయంత్రానికి ఇంటి ముందు పోశారు. ఇక ఇసుకను ఇంటి బేస్‌మట్టం పునాదుల్లో నింపేందుకు కూలీలు సిద్దమవుతున్నారు. పలుగు, పార చేతబట్టి ఇసుకను మోసేందుకు సిద్దమైన కూలీలు షాక్‌కు గురయ్యారు. వెంటనే భయంతో పరుగులు పెట్టారు. ఇసుకలో ఓ మనిషి మృతదేహం కనిపించడమే కూలీల భయానికి కారణం.. ఇసుకను ఆర్దరిస్తే మనిషి శవం డెలివరీ కావడంతో బిత్తరపోయిన ఇంటి యజమానికి కొద్దిసేపు ఏం చేయాలో అర్ధంకాలేదు. శుభామా.. అని ఇల్లు కట్టుకుంటుంటే ఈ శవం వచ్చిందేంటబ్బా.. అంటూ తల్లడిల్లిపోయాడు. వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంటి నిర్మాణం కోసం ఆర్దరిచ్చిన ఇసుకలో మృతదేహం వచ్చిందని తెలుసుకుని స్థానికులు తండోపతంగాలు వచ్చి చూశారు.

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ఓ ఇంటి నిర్మాణానికీ తరలించిన ఇసుకలో ఓ గుర్తు తెలియని మృతదేహం బయటపడింది… దీంతో స్థానికంగా కలకలం రేగింది. ఈపురుపాలెం గ్రామంలోని పద్మనాభుని పేటకు చెందిన కాగితి రాంబాబు అనే వ్యక్తి నూతన ఇంటిని నిర్మాణం చేపట్టాడు. ఇంటి నిర్మాణం పునాదుల వరకు వచ్చింది. పునాదుల్లో ఇసుకను నింపేందుకు ఇసుక కాంట్రాక్టర్ ద్వారా ఓ పది ట్రాక్టర్ల ఇసుకను కొనుగోలు చేశాడు. ఈరోజు ఆ ఇంటి పునాదులలో క్రేన్ సహాయంతో ఇసుకను నింపుతుండగా ఓ గుర్తు తెలియని మృతుదేహం ఇసుకలో కనిపించింది. ఇది క్రేన్ ఆపరేటర్, కూలీలు, ఇంటి యజమాని ఒక్కసారిగా నివ్వెరపోయారు .ఈ విషయం ఆనోటా ఈనోటా పడటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇసుక మట్టిదిబ్బలను క్రేన్‌తో తవ్వి ట్రాక్టర్‌లలో నింపే సమయంలో ఆ ఇసుక దిబ్బలో ఎవరో పూడ్చి పెట్టిన మృతదేహం ట్రాక్టర్ల ద్వారా తమకు డెలివరీ అయిందని ఇంటి యజమాని గుర్తించాడు. ఈ ఘటనతో భయబ్రాంతులకు గురైన ఇంటి యజమాని ఈపూరుపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటనా స్థలాన్ని చీరాల రురల్ సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ శివకుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Representative Image 1