AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Addanki: పిల్లలను స్కూల్‌కు తీసుకువెళ్తున్న బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. క్షణాల వ్యవధిలో

బాపట్ల జిల్లా అద్దంకి మండలం ఉప్పలపాడు సమీపంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శ్రీ చైతన్య స్కూలు బస్సుకు చెందిన డ్రైవర్ గుర్రాల ఏడు కొండలు విద్యార్థులను ఎక్కించుకొని అద్దంకి వస్తుండగా గుండె నొప్పి రావడంతో వెంటనే బస్సును పక్కకు తీసి ఆపేశాడు... విద్యార్దులు బస్సు దిగాలని పెద్దగా కేక వేసి సీటు పక్కనే ఉన్న బానెట్‌పై పడిపోయాడు... డ్రైవర్‌ అంకుల్‌కు ఏం జరిగిందోనన్న ఆతృతతో విద్యార్దులు ఆయన్ను పట్టుకుని పైకి లేపేందుకు ప్రయత్నించారు... అయితే

Addanki: పిల్లలను స్కూల్‌కు తీసుకువెళ్తున్న బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. క్షణాల వ్యవధిలో
School Bus
Fairoz Baig
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 20, 2023 | 1:57 PM

Share

అద్దంకి, సెప్టెంబర్ 20: పిల్లలను కాపాడాడు… తాను మాత్రం తనువు చాలించాడు… ఉదయం స్కూలు పిల్లలను తీసుకుని బస్సులో ఎప్పటిలానే బయలుదేరాడు డ్రైవర్‌ ఏడుకొండలు… మరికొద్ది సేపట్లో బస్సు స్కూలుకు చేరుకుంటుందనగా ఒక్కసారిగా గుండెల్లో విపరీతమైన నొప్పి వచ్చింది… తనకు గుండెపోటు వచ్చిందని తెలుసుకునేలోపే బస్సును సమయస్పూర్తిగా వ్యవహరించి రోడ్డుపక్కనే ఆపేశాడు… గుండెలను పిండేస్తున్న నొప్పిని భరిస్తూ సీటులో నుంచి లేచి పక్కనే ఉన్న బానెట్‌పై పడిపోయాడు… వెంటనే ప్రాణాలు విడిచాడు… తాను చనిపోతున్నానని తెలిసినా, బస్సును రోడ్డు పక్కకు ఆపి పిల్లల ప్రాణాలు కాపాడాడు… ఈ విషాద ఘటన బాపట్లజిల్లా అద్దంకి మండలం ఉప్పలపాడు దగ్గర జరిగింది…

బాపట్ల జిల్లా అద్దంకి మండలం ఉప్పలపాడు సమీపంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శ్రీ చైతన్య స్కూలు బస్సుకు చెందిన డ్రైవర్ గుర్రాల ఏడు కొండలు విద్యార్థులను ఎక్కించుకొని అద్దంకి వస్తుండగా గుండె నొప్పి రావడంతో వెంటనే బస్సును పక్కకు తీసి ఆపేశాడు… విద్యార్దులు బస్సు దిగాలని పెద్దగా కేక వేసి సీటు పక్కనే ఉన్న బానెట్‌పై పడిపోయాడు… డ్రైవర్‌ అంకుల్‌కు ఏం జరిగిందోనన్న ఆతృతతో విద్యార్దులు ఆయన్ను పట్టుకుని పైకి లేపేందుకు ప్రయత్నించారు… అయితే అప్పటికే డ్రైవర్‌ గుండె ఆగిపోయింది… బానెట్‌పైనే అచేతనంగా పడిపోయాడు… ఆ సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విషాదకర ఘటన స్థానికులను కలచివేసింది. గుండెను పిండేస్తున్న అంతనొప్పిలో కూడా పిల్లల క్షేమం కోసం ప్రాణాలను పణంగా పెట్టాడని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు డ్రైవర్‌ ఏడుకొండలు సమయస్పూర్తిని కొనియాడుతున్నారు.

పెరిగిన గుండెపోటు మరణాలు

ఇక ఈ మధ్య గుండెపోటు మరణాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సంగతి తెలిసిందే. అప్పటివరకు చలాకీగానే ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. పోస్ట్ కోవిడ్ పరిణామాల కారణంగా ఇలా జరుగుతుందా..? లేక లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులా అనే అంశంపై వైద్యులు పరిశోధనలు జరుపుతున్నారు. గతంలో కేవలం వయసు మీదపడినవారే గుండెపోట్ల బారిన పడటం చూశాం. కానీ ఇప్పుడు యువత, యుక్త వయస్సు వారు, చిన్న చిన్న పిల్లల్ని సైతం గుండె పోటు బలి తీసుకుంటుంది. రోజూ తేలికపాటి వ్యాయామం చేయడం, నడక, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం.. జంక్ ఫుడ్ అవౌడ్ చేయడం ద్వారా కొంతమేర రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు. ఇక పోతే ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు గుండె పనితీరును చెక్ చేయించుకోవడం కూడా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.