AP News: పల్నాడు కోడిపుంజుకే కాదు.. గొర్రెకు కూడా గుర్తింపు వచ్చింది.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో నల్లమల అటవీ ప్రాంతం ఆనుకొని పల్నాడు విస్తరించింది. పల్నాడు ప్రాంతం భౌగోళికంగా కీలకమైన ప్రాంతంగా భావిస్తారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పల్నాడులో గతంలో వెనుబాటుతనం ఉండేది. సాగర్ ప్రాజెక్ట్ రావడంతో వ్యవసాయం అభివ్రద్ది చెందింది. అంతేకాదు కాలక్రమేణ పగ, ప్రతికారాలు తగ్గాయి. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో గొర్రెకు జిఐ గుర్తింపు రావటంతో మరోసారి ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది.

AP News: పల్నాడు కోడిపుంజుకే కాదు.. గొర్రెకు కూడా గుర్తింపు వచ్చింది.
Palnadu Sheep
Follow us
T Nagaraju

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 20, 2023 | 1:24 PM

పల్నాడు, సెప్టెంబర్ 20: చారిత్రక నేపధ్యం ఉన్న ప్రాంతం పల్నాడు. మహాభారత యుద్ద గాథను పోలిన అన్నదమ్ముల మధ్య వైరం కారణంగా.. యుద్దం పల్నాడు ప్రాంతంలో కూడా జరిగింది. భారతంలో జూదం కారణంగా అన్నదమ్ముల మధ్య వివాదం మొదలైతే పల్నాడులో కోడి పుంజుల ఫైట్ తో రెండు రాజ్యాల మధ్య యుద్దం జరిగింది. దీంతో పల్నాడు కోడిపుంజుకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పౌరుషాలకు పల్నాడు కోడి పెట్టింది పేరు… ఇప్పుడు ఆ కోడి పుంజుతో పాటు పల్నాడు గొర్రెకు జిఐ(Geographical indication) గుర్తింపు లభించింది.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో నల్లమల అటవీ ప్రాంతం ఆనుకొని పల్నాడు విస్తరించింది. పల్నాడు ప్రాంతం భౌగోళికంగా కీలకమైన ప్రాంతంగా భావిస్తారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పల్నాడులో గతంలో వెనుబాటుతనం ఉండేది. సాగర్ ప్రాజెక్ట్ రావడంతో వ్యవసాయం అభివ్రద్ది చెందింది. అంతేకాదు కాలక్రమేణ పగ, ప్రతికారాలు తగ్గాయి. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో గొర్రెకు జిఐ గుర్తింపు రావటంతో మరోసారి ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అనేక ప్రత్యేకతలు, జీన్స్ ఉన్న గొర్రెగా స్థానిక వెటర్నరీ అధికారులు పల్నాడు గొర్రెను గుర్తించి గత పదిహేనేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రత్యేక లక్షణాలు ఉన్న నాటు గొర్రెగా గుర్తించారు. తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్వీ వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తలు గొర్రెల బాహ్య, జన్యు లక్షణాలు, వాటి జనాభా స్తితిగతులపై చేసిన పరిశోధనలను నేషనల్ బ్యూరో ఆప్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ సంస్థకు పంపించారు. స్థానిక శాస్త్రవేత్తలు పంపించిన అన్ని అంశాలను పరిశీలించిన సంస్థ పల్నాడు గొర్రెను ప్రత్యేక జాతిగా గుర్తించి భౌగోళిక గుర్తింపు ఇచ్చింది.

స్థానికంగా కూడా పల్నాడు ప్రాంతంలో లభించే గొర్రెలకు మంచి డిమాండ్ ఉంది. అన్ని వాతావరణాలను తట్టుకొని పెరగగలవన్న నమ్మకం స్థానికంగా ఉండే గొర్రెల కాపరుల్లో ఉంది. దీంతో గొర్రెలను పెంచుకునే యజమానులు.. ఈ ప్రాంత గొర్రెలను సుదూర ప్రాంతాల నుండి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు జిఐ గుర్తింపు లభించడంతో దేశ వ్యాప్తంగా మరోసారి ఈ ప్రాంతం పేరు వినిపిస్తుందని స్థానిక గొర్రెల కాపరులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.