Andhra: పచ్చిమిర్చి పనులు చేస్తుండగా.. అడుగు దూరంలో కనిపించిన మెరిసే వస్తువు.. ఏంటని చూడగా
ఒక్కరోజులో ఒక్క వజ్రం ఆ మహిళను లక్షాధికారిని చేసింది. ఒకరోజులో కూలీగా ఉన్న మహిళను లక్షలు వరించాయి. అదృష్టం ఎవరిని ఎలా వరిస్తుందోనని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ సారి ఈ స్టోరీ చదివేయండి మరి.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ మహిళ పంట పొలంలో.. పచ్చిమిర్చి పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. దొరికిన వజ్రాన్ని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రూ. 40 లక్షలు నగదు ఇచ్చి కొనుగోలు చేశాడు. అయితే బహిరంగం మార్కెట్‌లో ఈ వజ్రం విలువ ఇంకా ఖరీదైనదిగా తెలుస్తోంది. దొరికిన వజ్రాలు విలువ ఎంత చేస్తుందన్న అవగాహన లేక దొరికిన వజ్రాన్ని తక్కువ ధరకే అమ్మేసుకుంది ఆ మహిళ కూలీ. గతంలో జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళకు కోటి 20 లక్షల వజ్రం దొరికింది. మరోసారి రూ. 40 లక్షల వజ్రం దొరకడంతో గ్రామంలో వజ్రాల అన్వేషణ ఊపు అందుకుంది.
మహిళలు కూలీ పనులు చేస్తుండగా ఎక్కువ వజ్రాలు దొరుకుతుండటం విశేషం. ఇక్కడ కూలీలు వజ్రాలపై అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో విలువైన వజ్రాలు దొరుకుతుండడంతో వజ్రాల అన్వేషణ వేగంగా జరుగుతుంది. దాదాపుగా 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వజ్రాలు.. పంట పొలాల నుంచి బయటకు తేలికగా కనిపిస్తుండడంతో వజ్రాలు దొరుకుతున్నాయని ప్రచారం సాగుతుంది. ఈ ఊపుతో వజ్రాల కోసం అన్వేషణ భారీగా సాగిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు అయితే అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా పరుస్తుందో అర్థం కావడం లేదు. ఒకరోజులో లక్షాధికారుల నుంచి కోటీశ్వరులు అయిన సంఘటనలు చాలా ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








