AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Sale: 1200 కి.మీ రేంజ్.. రూ. 1.54 లక్షల భారీ డిస్కౌంట్.. ఈ హైబ్రిడ్ కారు చూస్తే కొనకుండా ఉండలేరు

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకీ కూడా ఒకటి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి.. మార్కెట్‌లోకి హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చింది. దీన్ని అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్‌తో మీరూ పొందొచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో మీరూ చూసేయండి మరి.

Car Sale: 1200 కి.మీ రేంజ్.. రూ. 1.54 లక్షల భారీ డిస్కౌంట్.. ఈ హైబ్రిడ్ కారు చూస్తే కొనకుండా ఉండలేరు
Car
Ravi Kiran
|

Updated on: Aug 19, 2025 | 12:22 PM

Share

భారత ఆటోమొబైల్ రంగం అంచలంచలుగా అభివృద్ధి చెందుతోంది. అలాగే ఈ ఆటోమొబైల్ మార్కెట్‌లో హైబ్రిడ్ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరిగిపోతోంది. దానికి కారణాలు లేకపోలేదు. రోజురోజుకూ పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. అలాగే పొల్యూషన్.. ఈ రెండింటి వల్ల చాలామంది హైబ్రిడ్ మోడళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇక మీరూ హైబ్రిడ్ మోడల్ కోసం చూస్తుంటే.. కొనుగోలు చేసి ఓ లాంగ్ డ్రైవ్ పోదాం అనుకుంటే.. లేట్ ఎందుకు మీకోసం ఓ ఎగ్జాంపుల్ తీసుకోచ్చేశాం. ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకి.. లగ్జరీ, ప్రీమియం మోడల్‌లో గ్రాండ్ విటారా SUVని లాంచ్ చేసింది. మారుతి సుజుకి నుంచి వచ్చిన ఈ హైబ్రిడ్ మోడల్ ప్రస్తుతం మార్కెట్‌లో హాట్ టాపిక్. జూలై 2025లో ఈ కారు కొనుగోలు చేసేవారికి రూ. 1.85 లక్షల డిస్కౌంట్ ఇవ్వగా.. ఇప్పుడు ఆఉగుస్త్‌లో ఈ కారుపై రూ. 1.54 లక్షల వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది కంపెనీ. ఈ డిస్కౌంట్ అన్ని వేరియంట్లపై అందుబాటులో ఉంది.

ఆల్ వీల్ డ్రైవ్‌పై డిస్కౌంట్..

మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా వేరియంట్‌లతో పాటు ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది మారుతీ సంస్థ. ఈ SUV ధర రూ. 11.42 లక్షల నుంచి రూ. 20.68 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు ఫుల్ ట్యాంక్ మీద 1200 కిమీల రేంజ్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఇంజిన్..

మారుతి, టయోటా సంయుక్తంగా హైరైడర్, గ్రాండ్ విటారాలను తయారు చేశాయి. హైరైడర్ లాగానే, గ్రాండ్ విటారాలో మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంది. ఇది 1462 cc K15తో వస్తోంది. ఇది 6,000 RPM వద్ద 100 bhp శక్తిని, 4400 RPM వద్ద 135 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది. కారు మైలేజ్ గురించి మాట్లాడుతూ, బలమైన హైబ్రిడ్ e-CVT 27.97kmpl మైలేజీని అందిస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ 5-స్పీడ్ MT 21.11 kmpl మైలేజీని ఇస్తుంది. అదే సమయంలో, మైల్డ్ హైబ్రిడ్ 6-స్పీడ్ AT మైలేజ్ 20.58 kmpl.