Road Accident : దారుణం.. తల్లి కళ్లముందే ముగ్గురు కుమారులను మింగేసిన మృత్యువు.. ఏం జరిగిందంటే..

స్థానికుల సహాయంతో ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. మృతులంతా భీమవరం వాసులుగా పోలీసులు గుర్తించారు.

Road Accident : దారుణం.. తల్లి కళ్లముందే ముగ్గురు కుమారులను మింగేసిన మృత్యువు.. ఏం జరిగిందంటే..
Road Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 28, 2024 | 11:03 AM

కాకినాడ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో బైక్‌ మీద వెళ్తున్న ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బైక్ పై నలుగురు ప్రయాణిస్తున్నారని తెలిసింది.  బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం మండలం తాడేరుకు చెందిన నంగలం దుర్గ అనే మహిళకు ముగ్గురు కుమారులు. దుర్గ, ఆమె కుమారులు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పని కోసమని నర్సీపట్నం వెళ్లిన తల్లీ కొడుకులు.. బైక్‌పై స్వగ్రామానికి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గండేపల్లి మండలం మురారి శివారులో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపు తప్పడంతో వారంతా కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరి పైనుంచి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో దుర్గ కుమారులు ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

తల్లికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఘటనాస్థలానికి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్