రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

ఇత్తడి పాత్రలో వండిన ఆహారాన్ని తీనటం, అందులో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల చి కిత్సలో సహాయపడుతుంది. అంతేకాదు, ఇత్తడి పాత్రలలో వండటం వల్ల ఆహారంలోకి జింక్ విడుదల అవుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడటమే కాకుండా

రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Brass Vessel For Tea
Follow us

|

Updated on: Jul 28, 2024 | 9:02 AM

మీ వంటగదిలో అనేక మెటల్ పాత్రలు ఉంటాయి. అవసరాన్ని బట్టి మీరు వాటన్నింటిన్ని వంట చేయడానికి ఉపయోగిస్తారు. కొంతమంది కిచెన్‌లో స్టీలు పాత్రల్లో ఆహారాన్ని వండుతారు. చాలా మంది అల్యూమినియం పాత్రలు వాడుతున్నారు. మరికొందరు స్టెయిన్‌లెస్ స్టీల్‌లో వంట చేస్తారు. కానీ, నేటికీ ఇత్తడి, ఇనుము, మట్టి పాత్రలలో ఆహారాన్ని వండుకునే అనేక ఇళ్ళు గ్రామాల్లో ఉన్నాయి. కానీ, ఎలాంటి పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది అనేది మాత్రం చాలా మందికి తెలియదు. కొన్ని రకాల లోహపు పాత్రల్లో ఆహారాన్ని వండటం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అలాగే, రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తయారు చేసి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

ప్రస్తుత కాలంలో ప్రజల జీవనశైలి దగ్గర నుంచి ఆహారపు ఆలవాట్ల వరకు చాలా మార్పులు వచ్చాయి. దీనికి తోడు ఇప్పుడంతా ఆహారం స్టీలు, అల్యూమినియం పాత్రలలోనే ఎక్కువగా వండుకుంటున్నారు. ఇక దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ, పూర్వం మాత్రం ఎక్కువగా రాగి, ఇత్తడి మట్టి పాత్రల్లోనే వంటలు వండేవారు. అందువల్ల ఏ అనారోగ్య సమస్యలు కూడా వచ్చేవి కాదు. కనుక ఆరోగ్యకరమైన ఆహారం తినడమే కాదు, ఎలాంటి పాత్రలు ఉపయోగిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. క్యాన్సర్, గుండెపోటు మొదలైన వ్యాధులకు ఈ పాత్రలు కూడా కారణం అంటున్నారు నిపుణులు.

అయితే చాలామందికి ప్రతి రోజూ టీ తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. మరి ఆ టీని కాస్త చిన్న ఇత్తడి పాత్రలో చేసుకొని తాగితే రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఇత్తడి పాత్రలో రోజు టీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. అలాగే ఇత్తడి పాత్రల్లో మెలనిన్‌‌ను ఉత్పత్తి చేస్తాయి. కనుక ఇందులో టీ, పాలు, నీలు తాగడం వలన చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పైగా హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తూ.. ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు పోయి చర్మం అందంగా మారుతుంది. ఇక ఇత్తడిలో ఉండే జింక్ రక్తాన్ని పెంచడానికి కూడా సహాయ పడుతుంది. పైగా రక్తంను శుద్ధి చేస్తుంది. దీంతో పాటు ఇత్తడి పాత్రల్లో ఆహారాన్ని వండటం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు కూడా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

ఇత్తడి పాత్రలో వండిన ఆహారాన్ని తీనటం, అందులో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల చి కిత్సలో సహాయపడుతుంది. అంతేకాదు, ఇత్తడి పాత్రలలో వండటం వల్ల ఆహారంలోకి జింక్ విడుదల అవుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడటమే కాకుండా హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఇత్తడి పాత్రల్లో వండే ఆహారం 90 శాతం పోషకాలను కలిగి ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో
రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో
ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే
ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. మోహిత్ రెడ్డికి నోటీసులు
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. మోహిత్ రెడ్డికి నోటీసులు
యానిమల్ సీక్వెల్ పై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు..
యానిమల్ సీక్వెల్ పై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు..
శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు అంటే ఏంటి.? ఇది ఎలా పనిచేస్తుంది.?
శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు అంటే ఏంటి.? ఇది ఎలా పనిచేస్తుంది.?
టాలీవుడ్‏లోకి సప్త సాగరాలు దాటి హీరోయిన్..
టాలీవుడ్‏లోకి సప్త సాగరాలు దాటి హీరోయిన్..
ఏఐ ఫీచర్‌తో రెండు నయా ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేసిన హెచ్‌పీ..!
ఏఐ ఫీచర్‌తో రెండు నయా ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేసిన హెచ్‌పీ..!
అసిడిటితో బాధపడుతున్నారా.. ఇంటి చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టొచ్చు..
అసిడిటితో బాధపడుతున్నారా.. ఇంటి చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టొచ్చు..
మీకు 30 ఏళ్లు నిండాయా.? ఇలా చేస్తే గుండె సమస్యలు మీ దరిచేరవు.
మీకు 30 ఏళ్లు నిండాయా.? ఇలా చేస్తే గుండె సమస్యలు మీ దరిచేరవు.
సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..
సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..