AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారేడు దళం.. రోజూ పరగడుపునే ఒక్కటి తింటే చాలు.. డాక్టర్‌ అవసరం ఉండదు..!

మధుమేహ బాధితులకు సైతం ఇది మందుగా పనిచేస్తుంది. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు బిల్వ పత్రం ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. మారేడులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు మరియు అలెర్జీలతో బాధపడేవారికి మారెడు దళం ఎంతో మేలు చేస్తుంది.

మారేడు దళం.. రోజూ పరగడుపునే ఒక్కటి తింటే చాలు.. డాక్టర్‌ అవసరం ఉండదు..!
Bel Patra
Jyothi Gadda
|

Updated on: Jul 28, 2024 | 7:10 AM

Share

బిల్వ పత్రం, మారేడు దళం.. పేరేదైనా.. ఆ పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనదిగా నమ్ముతారు. భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. ఒక చెంబు నీళ్లు, ఒక్క మారేడు దళం సమర్పించినా కూడా చాలంటారు. ఆ మహాశివుడు కరుణిస్తాడని భక్తుల విశ్వాసం. బిల్వ దళానికే ఆ పరమేశ్వరుడు పరమానందభరితుడు అవుతాడు. అలాంటి మారేడు దళం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయంటున్నారు. ఈ బిల్వ పత్రం సుగంధ భరితంగా ఉంటాయి. ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తాయని చెబుతున్నారు. మారేడు పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉంటాయి. కమ్మని వాసన కలిగి ఉంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి.

మారేడు ఆకులలో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. వేసవిలో ప్రతిరోజూ పరగడుపునే మారేడు ఆకులు తింటే ఎన్నో ప్రయోజనాలు అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. దీన్ని తీసుకుంటే గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయని చెబుతున్నారు. మారేడు ఆకులలో ధమనులు గట్టిపడకుండా నివారించే గుణం వుంది. ఇవి గుండెను వ్యాధుల నుండి రక్షిస్తాయి. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. బిల్వపత్రాలు గాలిని, నీటిని శుభ్రపరుస్తాయి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బిల్వపత్రంలో ఉండే ఐరన్‌ రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. మారేడుతో అధిక కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. నోటిపూతతో బాధపడేవారు పరగడుపునే దీన్ని తింటే ప్రయోజనం ఉంటుంది. మధుమేహ బాధితులకు సైతం ఇది మందుగా పనిచేస్తుంది. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మారేడు ఆకు ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. మారేడులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు మరియు అలెర్జీలతో బాధపడేవారికి మారెడు దళం ఎంతో మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..