Kurnool District News: విత్తనాలు వేయకముందే ఆ రైతు పంట పండింది.. ఏకంగా రూ. 30 లక్షల వజ్రం దొరికింది

కర్నూల్ జిల్లా తుగ్గలి మండలంలో దొరుకుతున్న వజ్రాలు రైతుల పంట పండిస్తున్నాయి. జొన్నగిరిలో అత్యంత విలువైన వజ్రాలు దొరకుతున్నాయి.

Kurnool District News: విత్తనాలు వేయకముందే ఆ రైతు పంట పండింది.. ఏకంగా రూ. 30 లక్షల వజ్రం దొరికింది
Kurnool District Diamond
Follow us

|

Updated on: Jul 11, 2021 | 5:43 PM

కర్నూల్ జిల్లా తుగ్గలి మండలంలో దొరుకుతున్న వజ్రాలు రైతుల పంట పండిస్తున్నాయి. జొన్నగిరిలో అత్యంత విలువైన వజ్రాలు దొరకుతున్నాయి. తాజాగా  నాగరాజు అనే రైతుకు జాక్‌పాట్ తగిలింది. పొలంలో విత్తనాలు వేస్తుండగా లక్షలు విలువచేసే వజ్రం కంటపడింది. స్థానిక వ్యాపారి ఆ వజ్రాన్ని 30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ అరుదైన వజ్రాన్ని కొనుగోలు చేయడానికి స్థానికంగా ఉండే వజ్రాల వ్యాపారులు పోటీ పడ్డారని తెలుస్తోంది. అయితే కోట్లాడి రూపాయలు విలువ చేసే వజ్రాన్ని స్థానిక వ్యాపారి త్వరపడటంతో తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. జొన్నగిరి, తుగ్గలి తదితర ప్రాంతాల్లో తరచుగా వజ్రాలు లభ్యమౌతున్న విషయం తెలిసిందే. వర్షాలు పడుతున్న కొద్దీ మట్టి పొరల్లో దాగిన ఎంతో విలువైన వజ్రాలు బయటపడతాయి.  వజ్రాల కోసం స్థానికులతో పాటు కర్నాటక జిల్లాల నుండి కూడా వచ్చి వెతుకుతుంటారు. మరోవైపు వజ్రాల వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొందరి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వజ్రాల వేలం పాటలు సీక్రెట్‌గా జరుగుతుండటం.. వజ్రం దొరికిందన్న ప్రచారం తప్ప ఎక్కడా రుజువులు లేకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేక సైలెంట్ అయిపోతున్నారు.

కాగా ఈ ఏడాది మే నెలలో ఓ రైతుకు కోట్లాది రూపాయలు విలువ చేసే వజ్రం దొరికినట్టు తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరకడంతో దానిని పరీక్షించారు. అది 30 క్యారెట్ల వజ్రంగా తేలడంతో వ్యాపారులు అతడి వద్దకు క్యూ కట్టారు. దాదాపు రూ.3కోట్లు విలువ చేసే వజ్రాన్ని రూ.కోటి 20లక్షలు కొనుగోలు చేశారు.

Also Read: ఏపీ విద్యార్థులకు బంపరాఫర్‌.. ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్న ప్రభుత్వం. అయితే..

ఎండకు తట్టుకోలేకపోయిన ఎలుగుబంటి.. ఐస్ గడ్డను చూసి ఏం చేసిందంటే.. వైరల్ అవుతన్న ఫన్నీ వీడియో..!

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ