AP Laptops To Students: ఏపీ విద్యార్థులకు బంపరాఫర్.. ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్న ప్రభుత్వం. అయితే..
AP Laptops To Students: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వేళ ఆన్‌లైన్ తరగతులు పెరగడంతో విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వడానికి సిద్ధమైంది. రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి చదువుతోన్న...
AP Laptops To Students: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వేళ ఆన్‌లైన్ తరగతులు పెరగడంతో విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వడానికి సిద్ధమైంది. రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి చదువుతోన్న విద్యార్థులకు ఈ ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. అయితే ప్రభుత్వం ఈ ల్యాప్‌టాప్‌లను అమ్మబడి పథకంలో భాగంగా ఇవ్వనుంది. అమ్మఒడి పథకంలో డబ్బులు తీసుకుంటున్న వారిలో ఎవరైతే డబ్బులకు బదులుగా ల్యాప్‌టాప్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారో వారికి వీటిని అందించనున్నారు. నగదు తీసుకోవాలా లేదా ల్యాప్‌టాప్ తీసుకోవాలన్న అన్నది విద్యార్థుల ఇష్టానికే ప్రభుత్వం వదిలేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
ఇందులో భాగంగా విద్యార్థులకు డ్యుయెల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 ఇంచుల స్క్రీన్, విండోస్ 10 ఎస్టీఎఫ్ మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఆఫీస్‌ల కాన్ఫిగరేషన్‌తో కూడిన ల్యాప్‌టాప్‌లను అందించనున్నారు. మూడేళ్ల వారెంటీతో ఈ ల్యాప్‌టాప్‌లను అందించనున్నారు. ఒకవేళ ల్యాప్‌టాప్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే పరిష్కరించాలని ల్యాప్‌టాప్‌లను అందిస్తోన్న కంపెనీకి ప్రభుత్వం షరతు పెట్టింది. ల్యాప్‌టాప్‌లో సమస్యలు తలెత్తితే విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది.
మేం అధికారంలోకి వస్తే.. మీకు 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీ.. ఇంకా.. ఉత్తరాఖండ్ ప్రజలకు కేజ్రీవాల్ వరాలు