Cell Tower: కృష్ణా జిల్లాలో విచ్చలవిడిగా సెల్ టవర్లు.. మొత్తం ఎన్ని టవర్లున్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!
Cell Tower: పెరుగుతున్న టెక్నాలజీతో పాటు అనార్థాలు కూడా పెరుగుతున్నాయి. అర చేతలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి నేటి
Cell Tower: పెరుగుతున్న టెక్నాలజీతో పాటు అనార్థాలు కూడా పెరుగుతున్నాయి. అర చేతలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి నేటి యువతరంది. రోజులో ఎక్కువ సమయం చాలా మంది ఈ స్మార్ట్ ఫోన్లతోనే కాలాన్ని వెల్లదిస్తున్నారు. ఇదే ఇప్పుడు జీవి మనుగడ పాలిట ముప్పుగా మారింది. ఎలా అంటారా? అయితే ఈ స్టోరీ చదివేయండి మరి.
మారుతున్న కాలంతో జీవన విధానం చాలా స్పీడుగా మారుతోంది. తెల్లారింది మొదలు.. పడుకునే వరకు ఫోనే జీవితంగా మారిపోయింది. మరి ఈ ఫోనే అనేక రోగాలకు కారణమవుతోంది. పెరుగుతున్న సెల్ ఫోన్ల వినియోగంతో సెల్ టవర్స్ నిర్మాణాలు పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది వందల కొలది సెల్ టవర్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీని వల్ల రేడియేషన్ పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్క కృష్ణా జిల్లాలోనే సెల్ టవర్స్ నిర్మాణాలు గడిచిన మూడేళ్లలో విపరీతంగా పెరిగాయి. 2017లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా 627 సెల్ టవర్స్ ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపయింది. ఈ సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ మూలంగా ప్రజలు శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. సెల్‌టవర్‌కు ఐదు వందల మీటర్ల దూరం వరకు దీని ప్రభావం అధికంగా ఉంటుంది. పటిష్ఠంగా లేని భవనాలపై టన్నుల కొద్దీ బరువుండే సెల్‌టవర్లు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ప్రమాదాలు జరగే అవకాశమూ ఉంది. ఇప్పటికే రేడియేషన్ వల్ల ప్రజలకు అనేక సమస్యలు తలెత్తుతుండగా.. విపరీతంగా పెరుగుతున్న ఈ సెల్ టవర్స్ వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. నగరంలో ఒక్క సంవత్సరంలోనే 25 టవర్ల కొత్త నిర్మాణానికి అప్లికేషన్లు వచ్చాయి. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు.. సెల్ టవర్లు ఎంత వేగంగా వ్యాపిస్తున్నాయో.
Also read:
8 ఓవర్లలో 10 వికెట్లు డౌన్.. అంతా కలిపి సాధించిన స్కోర్ చూస్తే షాకవ్వాల్సిందే..!