సండే కరోనా వ్యాప్తికి సెలవు లేదండి.. మాంసం దుకాణాలు, చేపల మార్కెట్ల వద్ద భారీగా దర్శనమిస్తున్న జనసమూహాలు

దేశంలో కొవిడ్‌ సెకెండ్‌ వేవ్ ఎంత డ్యామేజ్ చేసిందో అందరికీ తెలుసు. త్వరలో కోవిడ్ థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సండే కరోనా వ్యాప్తికి సెలవు లేదండి.. మాంసం దుకాణాలు, చేపల మార్కెట్ల వద్ద భారీగా దర్శనమిస్తున్న జనసమూహాలు
Fish Markects
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 11, 2021 | 3:55 PM

దేశంలో కొవిడ్‌ సెకెండ్‌ వేవ్ ఎంత డ్యామేజ్ చేసిందో అందరికీ తెలుసు. త్వరలో కోవిడ్ థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. లైట్‌ తీసుకోవద్దని ప్రభుత్వాలు నెత్తీ నోరూ బాదుకుంటున్నా జనం మాత్రం పిచ్చ లైట్ తీసుకుంటున్నారు. మాస్క్‌ పెట్టుకోనివాళ్లు కొందరైతే.. సోషల్ డిస్టెన్స్‌ పాటించనివాళ్లు మరికొందరు. నాన్‌ వెజ్‌ కోసం వచ్చేవాళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. బ్యాగులు, బాక్సులు పట్టుకొని బళ్లేసుకొని వచ్చేస్తున్నారు. కానీ ఎవరి మొహం మీద మాస్క్ కనిపించడం లేదు. ఆరడుగుల దూరం కాదు.. అరడుగు దూరం కూడా మెయింటైన్ చేయకుండా హస్కేసుకుంటున్నారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జనం రద్దీ చూస్తే వీళ్లకసలు కరోనా అంటే భయం ఉందా అనే డౌటొస్తుంది. సామాజిక దూరం సంగతి దేవుడెరుగు..చాలా మంది కనీసం మాస్క్‌లు కూడా పెట్టుకొని కనిపించడం లేదు. చేపలు అమ్మేవాళ్లు మాస్క్‌లు, గ్లోవ్‌లు ధరించడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే ఒక్కొక్కరి దగ్గరా సవాలక్ష కారణాలు.

విజయవాడ వన్‌ టౌన్ ఫిష్‌ మార్కెట్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో కొవిడ్‌ హబ్‌గా మారిన ఈ మార్కెట్‌లో నాన్‌ వెజ్ ప్రియులు సోషల్‌ డిస్టెన్స్‌ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే అవేవీ పట్టనట్టు హైదరాబాద్‌లోని చేపలు-మాంసం మార్కెట్లు తెల్లవారు జాము నుంచే రద్దీగా మారాయి. మాస్కులు పెట్టుకున్నప్పటికీ ఎవరూ భౌతిక దూరం పాటించడం లేదు. ముఖ్యంగా ఆదివారం కావడంతో ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది.

హైదరాబాద్‌ రామ్‌నగర్‌ ఫిష్‌ మార్కెట్‌ జనంతో కిక్కిరిసిపోయింది. నో కరోనా కండిషన్స్‌.. నో క్యూ.. గుంపులు గుంపులుగా ఒక్క దగ్గరికి చేరి చేపల కొనుగోలుకు పోటీపడ్డారు. చికెన్‌, మటన్‌తో పోలిస్తే చేపలు లైట్‌ ఫుడ్‌ కావడంతోపాటు ఇమ్యూనిటీ బూస్టర్‌ మరింత పెరుగుతుందనే ఉద్దేశ్యంతో నాన్‌వెజ్‌ ప్రియులు భారీగా తరలి వచ్చారు.

Also Read:  నేడే రోదసిలోకి తెలుగమ్మాయి శిరీష.. 90 నిమిషాల ప్రయాణం.. ఇంట్రస్టింగ్ విషయాలు

సొంత మనవరాలినే కిడ్నాప్ చేసిన అమ్మమ్మ, ఎందుకో తెలిస్తే షాకే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే