AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: విశాఖలో మరో కిడ్నాప్ కేస్.. రూ. 60 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్.. పోలీసుల అదుపులో..

Visakhapatnam: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ ఉదాంతం ముగిసి నెల కూడా కాకముందే మరో కుటుంబం కిడ్నాప్‌ జరిగింది. శ్రీనివాస్ అనే విశాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని భార్య లక్ష్మిని బుధవారం సాయంత్రం కొందరు దుండగులు..

Visakhapatnam: విశాఖలో మరో కిడ్నాప్ కేస్.. రూ. 60 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్.. పోలీసుల అదుపులో..
Visakha Kidnap Case
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 29, 2023 | 1:12 PM

Share

Visakhapatnam: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ ఉదాంతం ముగిసి నెల కూడా కాకముందే మరో కుటుంబం కిడ్నాప్‌ జరిగింది. శ్రీనివాస్ అనే విశాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని భార్య లక్ష్మిని బుధవారం సాయంత్రం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే వీరిద్దరిని బలవంతంగా విజయవాడకు తరలించాలనుకున్న దుండగులు.. మార్గమధ్యంలోనే మనసు మార్చుకుని రియల్టర్ భార్య లక్ష్మిను దించేశారు. అందిందే అవకాశం అనుకున్న ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.

శ్రీనివాస్ భార్య లక్ష్మి తెలిపిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన కాకినాడ పోలీసులు.. కిడ్నాపర్లను అన్నవరం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విశాఖ నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. శ్రీనివాస్ దంపతులను  కిడ్నాప్‌ చేయడానికి కారణాలను తెలుసుకునే నేపథ్యంలో కిడ్నాపర్లను పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు తెలిశాయి. శ్రీనివాస్ అంతకముందు విజయవాడలో ఎంతో మంది నుంచి డబ్బులు తీసుకుని విశాఖకు మకాం మార్చాడని, ఇంకా 2021 అతనిపై విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై జైలుకు వెళ్లాడని తెలిసింది.

అలాగే జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత విశాఖలోని మరో రియల్ ఎస్టేట్ సంస్థలో ఏజెంట్‌గా శ్రీనివాస్ చేరాడని పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. కాగా, శ్రీనివాస్‌పై రూ.3 కోట్ల రూపాయలు కాజేసినట్లుగా ఆరోపణలు ఉండగా.. అందులో రూ. 60 లక్షలు తమకు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే విశాఖ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న ఈ కిడ్నాప్ కేసులు పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట